ETV Bharat / state

సచివాలయం భద్రతా విధుల నుంచి తెలంగాణ స్పెషల్ పోలీస్ తొలగింపు

సచివాలయం భద్రత ఇక నుంచి ఎస్పీఎఫ్​కు - ప్రత్యేక పోలీస్​ విభాగం నుంచి మారుస్తూ ఆదేశాలు - గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రత్యేక పోలీసులు

SECRETARIAT SECURITY
SECRETARIAT SECURITY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

'ఒకే రాష్ట్రం-ఒకే పోలీస్' విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ పోలీస్ బెటాలియన్ సిబ్బంది(తెలంగాణ స్పెషల్ పోలీస్) చేస్తున్న ఆందోళనతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారు చూస్తున్న సచివాలయం భద్రతను మళ్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ - ఎస్పీఎఫ్​కు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

కొత్త సచివాలయం ప్రారంభం నుంచి తెలంగాణ స్పెషల్ పోలీస్ భద్రత విధులు నిర్వహించింది. సుమారు 600 మంది సిబ్బంది రోజువారి విధుల్లో ఉండేవారు. అంతకుముందు 25 ఏళ్లుగా ఎస్పీఎఫ్ సెక్రటేరియెట్ భద్రతను చూసుకునేది. కేసీఆర్​ సర్కార్ కొత్త సచివాలయం నిర్మాణం తరువాత ఆ బాధ్యతలు తెలంగాణ స్పెషల్​ పోలీస్​కు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ సర్కార్ ఎస్పీఎఫ్​(SPF)కు అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగింది : సెలవుల విషయంలో పోలీస్ శాఖ కొత్తగా జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలంటూ గత వారం రోజులుగా తెలంగాణ స్పెషల్ పోలీసులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీటిపై డీజీపీ కూడా స్పందించారు. సెలవుల విషయంలో పాత విధానాన్ని అనుసరిస్తామని ప్రకటించారు. అయినా కూడా వారి ఆందోళనలు ఆగలేదు. 'ఒకే పోలీస్ - ఒకే రాష్ట్రం' పేరుతో తమకు సాధారణ పోలీసుల తరహాలో డ్యూటీలు వేయాలని, సెలవులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఆందోళనలపై ఆగ్రహంతో పోలీస్​ ఉన్నతాధికారులు ఇప్పటికే 10 మందిని డిస్మిస్ చేయడంతో పాటు 39 మంది సస్పెండ్ చేశారు. అయినా కూడా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద విధుల్లో ఉన్న 22 మంది స్పెషల్ పోలీస్ -టీజీఎస్పీ సిబ్బందిని అకస్మాత్తుగా మార్చారు. వారి స్థానంలో ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పగించారు.

తాజాగా సెక్రటేరియెట్ విషయంలోనూ తెలంగాణ స్పెషల్ పోలీస్​ సిబ్బందిని తప్పించి ఎస్పీఎఫ్​కు ఆ విధులు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఇటీవలే సచివాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న టీఎస్​ఎస్పీ సిబ్బందికి సెక్రటేరియెట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కీలక ఆదేశాలు జారీచేశారు. సిబ్బంది సోషల్ మీడియాలో చేసే పోస్టులపై జాగ్రత్తలు సూచించారు. పోలీసు అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టవద్దని, లైక్ చేయడం, ఫార్వర్డ్​ చేయకూడదని అందులో సూచించారు.

'వారిని విధుల్లోకి తీసుకోండి.. లేదంటే మమ్మల్ని సస్పెండ్​ చేయండి' - ఆగని ఖాకీల ఆందోళనలు

తెలంగాణ పోలీస్‌శాఖ సంచలన నిర్ణయం - 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.