Hyderabad Urban Development Works : అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల నిజమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. ఆ మరుపురాని క్షణాలు ఇంకా కళ్ల ముందు మెదలుతూనే ఉన్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో ఎంతగానో పురోగమించింది. ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతి రంగంలో దూసుకెళ్లింది. అయితే ఇంకా ఎక్కడ ప్రగతి సాధించాల్సి ఉంది? గత నగరాన్ని సమీక్షించుకుని రాబోయే రోజుల్లో స్వల్ప, దీర్ఘకాలిక భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకుంటే సుస్థిరాభివృద్ధి కలిగిన నగరంగా ఎదగడానికి అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.
కనీస సౌకర్యాలపై దృష్టి : హైదరాబాద్ నగరం దశాబ్దకాలంలో అవుటర్ రింగ్‌రోడ్డు దాకా విస్తరించి. అభివృద్ధితో అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతోంది. పైకి అంతా బాగానే ఉన్నా వివరంగా పరిశీలిస్తే కనీస సౌకర్యాల కల్పన, నాణ్యమైన వసతుల్లో హైదరాబాద్ చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి నగర జీవనం చేరుకోవాలంటే భారీగా నిధులు కేటాయించాల్సి అవరం ఉంది. ఇందుకు సంవత్సరానికి రూ.వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని గతంలో అధికారులు లెక్కలు వేశారు.
చిన్న వర్షం పడినా రోడ్లన్ని జలమయం : సిటీలో చిన్న వర్షం పడినా నాలాలు, డ్రైన్లు పొంగి పొర్లుతుంటాయి. వరద కాల్వలు, మురుగుకాల్వలు నీరు రోడ్లపై ప్రవహిస్తుంటాయి. వర్షం పడితే నగర జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు నాలాల విస్తరణ పనులు చేస్తున్నా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వీటికి అన్ని దశల్లో కలిపి రూ.10వేల కోట్లు అవుతుందని నిపుణులు అంచనా వేశారు.
విస్తరించాల్సిన ప్రజారవాణ : నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి చెప్పనవరంస లేదు. ప్రజారవాణా వ్యవస్థను మరింతగా విస్తరించాలి. మెట్రో రెండో దశలో 70 కి.మీ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఇందుకోసం రూ.17వేల కోట్ల పైనే వ్యయం అవుతుందని లెక్కలు వేశారు. సిటీలో ఎంఎంటీఎస్ మూడో దశ విస్తరణ, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు అయ్యే వ్యయం కలుపుకొంటే రూ.20వేల కోట్ల వరకు కావాలి.
శివార్లలో నీటి కొరత : ప్రధాన నగరంలో తాగునీటి సరఫరా మెరుగ్గానే ఉన్నా శివార్లలో నీటి కొరత వెంటాడుతుంది. అవుటర్ మార్గంలో రింగ్ మెయిన్ పనులు, గోదావరి నుంచి సిటీకి తరలించేందుకు, రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.15వేల కోట్ల వరకు అవుతుంది. ఇందుకు ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించాల్సింది.
- హైదరాబాద్‌లో క్రీడా మైదానాలు సరిపడా లేవు. ఉన్నవాటిలో తగినన్ని సౌకర్యాలు లేవు. వాటిపైన దృష్టి సారించాలి.
- పార్కుల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టాలి. ఆక్రమణలు చోటుచేసుకోకుండా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. వాటి అభివృద్ధి దిశగా కార్యచరణ చేపట్టాలి.
- రోడ్లపై నడుస్తూ పలువురు పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరి రక్షణకు ఆటంకాలు లేని ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టాలి.
- హైదరాబాద్‌లో ప్లాస్టిక్ వాడకం ఎక్కడ. జలశాయాల్లో కలిసి కాలుష్యం మరింత పెరుగుతుంది. దీన్ని కట్టడి చేయాలి.
- పార్కింగ్ అతిపెద్ద సమస్యగా మారుతోంది. వీటి కోసం పార్కింగ్ సముదాయాలు, స్మార్ట్ పార్కింగ్ కేంద్రాలు నిర్మించాలి.
అభివృద్ధి పనుల పూర్తికి చర్యలు చేపట్టండి : భట్టి విక్రమార్క
రామగుండం నగరాభివృద్ధి పనులు - సందిగ్ధంలో వ్యాపారుల జీవితాలు - GODAVARIKHANI ROAD EXPANSION Works