ETV Bharat / state

నకిలీ పాస్​పోర్ట్​ల కేసులో ఎస్బీ పోలీసుల అక్రమాలు - అబ్దుల్‌ సత్తార్‌ ముఠాకు సహకరించినట్లు గుర్తింపు - హైదరాబాద్ ఫేక్ పాస్​పోర్ట్ కేసు

Telangana Fake Passport Case Update : బోగస్ పాస్​పోర్టుల కేసులో ఎస్బీ పోలీసుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాసుల కోసం కక్కుర్తి పడిన సిబ్బంది అక్రమాలు ఉన్నతాధికారుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక నిందితుడు అబ్దుల్‌ సత్తార్‌ ముఠాతో కుమ్మక్కయిన ఎస్బీ పోలీసులు పూర్తిగా నిందితులకు సహకరించినట్టు సిఐడీ విచారణలో బయటపడింది.

CID Investigation In Passport Issue
Telangana Fake Passport Case Update
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 11:43 AM IST

Telangana Fake Passport Case Update : బోగస్ పాస్‌పోర్టుల కేసులో ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాసుల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది లీలలు సీఐడీ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. కేసులో కీలక నిందితుడు అబ్దుల్‌ సత్తార్‌ ముఠాకు ఎస్బీ పోలీసులు పూర్తిగా సహకరించినట్టు సీఐడీ విచారణలో తేలింది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇంటిపేరు లేకున్నా విచారణ గట్టెక్కించేలా ఎస్బీ సిబ్బంది నడుచుకున్నట్టు తేలడంతో దర్యాప్తు అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

CID Special Focus on Fake Passports : సాధారణంగా పాస్‌పోర్టు జారీలో దరఖాస్తుదారుడికి సంబంధించి క్షేత్రస్థాయిలో పూర్తి వివరాల సేకరణ అత్యంత కీలకం. వాస్తవానికి ఎస్బీ విచారణలో పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు స్థానికుడా ఎన్నేళ్లుగా అక్కడ నివసిస్తున్నాడని అతడికి నేరచరిత ఏమైనా ఉందా వంటి అంశాలపై తనిఖీ చేయడమే కీలకం. ఇందుకోసం దరఖాస్తుదారుడు ఇచ్చిన చిరునామాకు వెళ్లి ఇరుగు పొరుగును విచారించాల్సి ఉంటుంది. అతడి గుణగణాల గురించి ఆరా తీసి నివేదికలో పొందుపరచాలి. దరఖాస్తుదారుడు ఆ చిరునామాలో ఉంటున్నట్లు రుజువు కాకపోతే పాస్‌పోర్టు జారీ చేయొద్దని సిఫారసు చేయాల్సి ఉంటుంది.

నకిలీ పాస్​పోర్టు కేసు - వారిని దేశం దాటనీయకుండా సీఐడీ నిఘా

CID Investigation In Passport Issue : సత్తార్ ముఠా ఇచ్చే సొమ్ములకు ఆశపడి పలువురు సిబ్బంది ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. ఎలాంటి విచారణ లేకుండానే నివేదిక సమర్పించినట్లు గుర్తించారు. బోగస్‌ పాస్‌పోర్టుల కోసం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనే సత్తార్ ముఠా ప్రత్యేకంగా ఎంచుకున్నట్లు తేలింది. ఎక్కడైతే ఎస్బీ సిబ్బంది అనుకూలంగా ఉన్నారో అక్కడి చిరునామాలతో పాస్‌పోర్టు దరఖాస్తులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. అక్కడి ఎస్బీ సిబ్బంది పాత్రపై సీఐడీ దర్యాప్తు చేయడంతో అక్రమాల బాగోతం బహిర్గతమవుతోంది. ఇప్పటికే నలుగురు ఎస్బీ సిబ్బందిని అరెస్ట్ చేసిన సీఐడీ మిగిలిన వారి పాత్రపైనా ఆరా తీస్తోంది.

Passport Issue Case With Fake Documents : శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ దేశస్థులకు ఎక్కువగా బోగస్ పాస్‌పోర్టులు ఇప్పించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన 92 బోగస్ పాస్‌పోర్టుదారుల్లో ఎక్కువ మంది శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఈమేరకు వారిపై లుక్ అవుట్ సర్క్యులర్ నోటీసులు జారీ చేయడం ద్వారా బోగస్ పాస్‌పోర్టులను జప్తు చేయాలని సిఐడీ భావిస్తోంది. సత్తార్ ముఠా బోగస్ పాస్​పోర్టుల వ్యవహారంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనే ప్రత్యేకంగా ఎంచుకున్నట్లు తేలింది.

తమకు ఎక్కడైతే ఎస్బీ సిబ్బంది అనుకూలంగా ఉన్నారో అక్కడి చిరునామాలతోనే బోగస్ పాస్​పోర్టు దరఖాస్తులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా భీంగల్, జగిత్యాల, హైదరాబాద్ ఫలక్​నామాలో ఎంచుకున్న చిరునామాల్లోనే ఎక్కువగా దరఖాస్తులు ఉన్నట్లు వెల్లడైంది. అక్కడి ఎస్బీ సిబ్బంది పాత్రపై సీఐడీ దర్యాప్తు చేయడంతో అక్రమాలు బహిర్గతమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటికే నలుగురు ఎస్బీ సిబ్బందిని అరెస్ట్ చేసిన సీఐడీ మిగిలిన వారి పాత్రపైనా ఆరా తీస్తోంది.

నకిలీ పాస్​పోర్ట్​ల కేసులో కీలక పరిణామం - సీఐడీ అదుపులో ఏఎస్ఐ

Fake Passport Gang Arrest: నకిలీ పాస్​పోర్ట్ ముఠా గుట్టురట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.