ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు - ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు - TELANGANA EX SARPANCH PROTEST

రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచుల నిరసనలు - పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలంటూ డిమాండ్

Ex Sarpanch Protest
Telangana Ex Sarpanch Protest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 2:01 PM IST

Telangana Ex Sarpanch Protest :పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లు నిరసనలు చేస్తున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకోగా మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. అప్పులు తెచ్చి గ్రామాల్లో శ్మశానవాటికలు, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్‌ యార్డులు వంటి అనేక అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు.

ఆయా పనులకు సంబంధించి 2019నుంచి 2024వరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బిల్లులు చెల్లించాలని సీఎం, గవర్నర్ సహా అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేయడం సరికాదని చెబుతున్నారు.

మాజీ సర్పంచుల పరిస్థితి దారుణం : పెండింగ్‌ బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఏడాదిగా తిరుగుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. వారి కుటుంబాలను రోడ్డున పడేయడం దారుణమని తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : మాజీ సర్పంచుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సీఎంను కలిసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసిన డబ్బు ఇవ్వాలని కోరితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. మాజీ సర్పంచులు అంతా అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యాపిల్లల బంగారం తాకట్టు పెట్టి పనులు చేపట్టారని తెలిపారు. ప్రజాపాలన అంటే గ్రామానికి సేవ చేసిన వారిని అరెస్టు చేయడమేనా?అని ప్రశ్నించారు.

మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు : మాజీ సర్పంచ్​ల నిరసన కార్యక్రమం నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సర్పంచ్​లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆదివారం అర్ధరాత్రి సర్పంచ్​లను అరెస్టు చేసి బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. మాజీ సర్పంచ్​లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గ్రామపంచాయతీలు అద్వానంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తాము గ్రామాలలో అభివృద్ధి చేయడం కోసం తమ ఆస్తులు తాకట్టు పెట్టి పంచాయతీల నిర్వహణ కొనసాగించామని తెలిపారు. కానీ ప్రభుత్వం పంచాయతీలకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ బిల్లులు అడిగేందుకు హైదరాబాదులో చేస్తున్న నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా తమను అర్థరాత్రి పోలీసులు నిర్బంధించడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం బిల్లులను విడుదల చేయని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేనట్లే! - ఇక 2025లోనే సర్పంచ్​ల ఎన్నిక? - Local Bodies Elections Issue

'సర్పంచ్​గా ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు ఇస్తా' - సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న పోస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.