ETV Bharat / state

డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్య గమనిక - ఒక్కరికే రెండు పోస్టులు రావు - DSC Candidates Posting Updates - DSC CANDIDATES POSTING UPDATES

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- ఏదో ఒక పోస్టుకే ఎంపిక - చర్యలు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ

DSC Selected Candidates Posting Updates
DSC Selected Candidates Posting Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 10:23 AM IST

DSC Selected Candidates Posting Updates : డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల్లో ఏదో ఒక దానికే ఎంపికయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇటీవల డీఎస్సీ ఫలితాలు వెల్లడి కాగా వందల మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. దీంతో వారు ఏదైనా ఒక దాంట్లో చేరితే మళ్లీ వందల పోస్టుల్లో ఖాళీలు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు తొలుత ఎస్‌ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో లిస్ట్ విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. మొదటి జాబితాలో ఉన్న వారెవరైనా రెండో జాబితాలో ఉంటే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్‌లో ఉన్న వారిని చేరుస్తామని స్పష్టం చేశారు. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

దానిపై సీఎంకు లేఖ : ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలో 43 మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. వారికి డీఈవో కార్యాలయ సిబ్బంది ముందుగానే ఫోన్‌ చేసి ఏ పోస్టు కావాలో డిక్లరేషన్‌ తీసుకుని వారికి నచ్చిన పోస్టును ఇస్తున్నారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు ఖాళీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులకు కూడా అన్ని జిల్లాల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. తక్కువ సమయంలో టీచర్లకు నియామక పత్రాలు ఇవ్వనుండటం అభినందనీయమని ఆనందించారు.

ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల అడ్డదారులు - అర్హత లేకున్నా ఈడబ్ల్యూఎస్​ సర్టిఫికెట్ల​ సమర్పణ - Telangana DSC Counseling 2024

స్పెషల్ ఎడ్యుకేటర్​ పోస్టులు భర్తీ చేయాలి : ప్రత్యేకావసరాల విద్యార్థులకు బోధించేందుకు ఈసారి 220 ఎస్‌ఏ, 796 ఎస్‌జీటీ స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులను భర్తీ చేయాలి. ఈ పోస్టులకు టెట్ అర్హత అవసరం లేదని గత ఏప్రిల్​లో 62మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 17 జిల్లాల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశామని, 16 జిల్లాల్లో జరగలేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

అధిక శాతం మహిళలే : ఉపాధ్యాయ పోస్టులకు పోటీపడిన వారిలో అధికశాతం మంది మహిళలే. వివాహం ముందు, తరవాత వారి ఆధార్ కార్డుల్లో ఇంటి పేర్లు, ఇతర వివరాలు వేరుగా ఉండటంతో ధ్రువపత్రాల పరిశీలన సందర్భంగా డీఈవోలు అభ్యర్థుల భర్తలను పిలిచి వారితో తన భార్యేనని లేఖ రాయించుకుంటున్నారు.

సర్టిఫికేట్ వేరిఫికేషన్​కు హాజరు కాని 1458 మంది : టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 25,924 మంది అవకాశం కల్పించగా 24,466మంది అభ్యర్థులు హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. అంటే 1,458 వెరిఫికేషన్​కు రాలేదు. వికారాబాద్​ జిల్లాలో 923మందిగి 400, కొత్తగూడెంలు 1018కి 936, హైదరాబాద్​లో 1537కి 1355 మంది అభ్యర్థులే హాజరయ్యారు. మంచిర్యాల జిల్లాలో 715 మందికి కేవలం ఒక్కరు మాత్రమే హాజరు కాలేదు.

ముఖ్యమంత్రికి కంగ్రాట్స్ చెప్పిన బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి - AVN Reddy letter to CM Revanth

ఆ ఫ్యామిలీలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే - డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన తండ్రీకుమారులు - Father and Son Selected in DSC

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.