ETV Bharat / state

సామాన్యులకు కరెంట్ షాక్ - తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు - TG Electricity Charges Revise

Telangana Electricity Charges Revise : తెలంగాణలో కరెంట్ ఛార్జీలు సవరించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను ఈఆర్సీకి సమర్పించాయి. పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు, ఇళ్లకు 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీ కిలోవాట్‌కు రూ.40 పెంచాలని కోరాయి. 80 శాతానికి పైగా గృహాలు 300 యూనిట్లలోపే ఉండటం వల్ల ఎలాంటి భారం ఉండబోదని డిస్కంలు వివరణ ఇచ్చాయి.

TG Electricity Charges Revise
TG Electricity Charges Revise (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2024, 9:11 AM IST

తెలంగాణలో మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు (ETV Bharat)

Discoms on Current Bills Revise in Telangana : తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాయి. మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. వీటిని ఈఆర్సీ ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి రూ.1200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనలపై రాష్ట్రంలో కనీసం మూడుచోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేశాకే ఈఆర్సీ తుది తీర్పు ఇస్తుంది.

లోటును పూడ్చుకునేందుకు సవరణ : అనంతరమే ఛార్జీల సవరణ అమలులోకి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు 90 రోజుల సమయం పడుతుంది. తెలంగాణలోని ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14,222 కోట్లుగా ఉంటుందని అంచనా వేశాయి. ఈ మొత్తంలో రూ.13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగిలిన రూ.1200 కోట్ల లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు ప్రకటించాయి.

ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తుండగా, రూ.50కి పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్లలోపు కరెంట్ వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి స్థిరఛార్జీ పెంపు ఉండదు. రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారు. దీని వల్ల ప్రజలపై పెద్దగా స్థిరఛార్జీ పెంపు భారం పడదని డిస్కంలు చెబుతున్నాయి.

పరిశ్రమలన్నీ ఒకే కేటగిరీ కిందకు : ప్రస్తుతం హెచ్‌టీ పరిశ్రమల జనరల్‌ కేటగిరీలో మూడు రకాల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 11 కేవీ సామర్థ్యంతో కనెక్షన్‌ తీసుకున్న పరిశ్రమ వినియోగించుకున్న కరెంట్​కు యూనిట్‌కు 7.65 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. 33 కేవీ సామర్థ్యంతో కనెక్షన్‌ తీసుకుంటే 7.15 రూపాయల చొప్పున, 132 కేవీ అయితే 6.65 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని కేటగిరీల పరిశ్రమల నుంచి యూనిట్‌కు 7.65 రూపాయల చొప్పునే వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. పరిశ్రమల నుంచి కిలోవాట్‌కు రూ.475 చొప్పున వసూలు చేస్తున్న స్థిరఛార్జీని రూ.500లకు పెంచాలని కోరాయి.

Electricity Bills Hike in Telangana : ఈ నివేదికను 2023 నవంబర్ 30 కల్లా మండలికి ఇవ్వాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవ్వలేదు. 2024 జనవరి ఆఖరుకు ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించినా లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి. దాంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆలస్యానికి రూ.21 లక్షల జరిమానాను డిస్కంల నుంచి ఈఆర్సీ వసూలు చేసింది. ఏఆర్ఆర్ ఇవ్వడంలో జాప్యం చేసినందుకు డిస్కంల ఈక్విటీలో నెలకు 0.5 శాతం చొప్పున వసూలు చేస్తామని ఈఆర్సీ చెప్పింది. ఇది కూడా డిస్కంలకు నష్టమేనని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన ఛార్జీల సవరణ ఏఆర్ఆర్ నివేదికను సైతం 2024 నవంబర్ కల్లా ఈఆర్సీకి ఇవ్వాలి.

విద్యుత్ వినియోగదారులకు గుడ్​న్యూస్ - ఇకపై పాత పద్ధతిలోనే బిల్లుల చెల్లింపులు - upi payments of electricity bills

రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి గొట్టిపాటి - Gottipati Took Charge as Minister

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.