ETV Bharat / state

మీ 'వాట్సాప్‌'కు రుణమాఫీ మెసేజ్‌ వచ్చిందా? - క్లిక్ చేశారో ఖాతాలో డబ్బంతా కల్లాస్!! - TELANGANA LOAN WAIVER FRAUD LINKS - TELANGANA LOAN WAIVER FRAUD LINKS

Cyber Criminals Eye On Loan Waivers : సైబర్​ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా రైతు రుణమాఫీ లబ్ధిదారులపై వారి కన్ను పడింది. బ్యాంకు లోగోతో ఉండే వాట్సాప్​ నంబర్ల నుంచి మోసపూరిత లింక్​లను పంపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అలాంటి ఫేక్​ లింక్​లపై క్లిక్​ చేయవద్దని సూచిస్తున్నారు. సైబర్​ మోసాలకు గురైనట్లయితే వెంటనే 1930కి ఫోన్​ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

Cyber Criminals Eye On Loan Waivers
Cyber Criminals Eye On Loan Waivers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 12:11 PM IST

Cyber Criminals Eye On Loan Waivers : కాదేదీ సైబర్​ నేరగాళ్లకు అనర్హం అన్నట్లుగా తయారయ్యింది వారి పరిస్థితి. ప్రజలను మోసగించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా సైబర్​ కేటుగాళ్లు వదులుకోవడం లేదు. మారుతున్న పరిణామాలు ఆసరాగా చేసుకుని అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి ప్రజల సొమ్ము కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ సొమ్ము అసరాగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

బ్యాంకులోగోతే ఉండే నంబర్ల నుంచి : తాజాగా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో సైబర్​ నేరగాళ్లు ఆ పథకం లబ్ధిదారులపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. బ్యాంకు లోగోతో ఉండే వాట్సాప్ నంబర్ల నుంచి మోసపూరిత ఫైల్స్​, లింక్​లను పంపిస్తున్నారు. పొరపాటున అటువంటి లింక్​లపై క్లిక్​ చేశారో ఇక అంతే సంగతులు. అలా చేయడం ద్వారా ఫోన్​ హ్యాకవ్వడం, లేదా ఎనీడెస్క్​ యాప్​ వంటివి మీ సెల్​ఫోన్​లో డౌన్​లోడ్​ అవుతాయి.

ఇంట్లోనే ఉంటూ ఆన్​లైన్​లో రెస్టారెంట్లు, హోటళ్లకు రేటింగ్​ ఇస్తే డబ్బులు - నిజమని నమ్మి రివ్యూ ఇచ్చారో అంతే! - Hotel Review Cyber Crime

వెంటనే ఫోన్​ను సైబర్​ నేరగాళ్లు వారి ఆధీనంలోకి తీసుకుని మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును కొట్టేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్న నేపథ్యంలో కొందరికి వాట్సాప్​లో నకిలీ మెసేజ్​లు వస్తున్నట్లు సైబర్​ క్రైమ్ విభాగం పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద లింకులతో నకిలీ మెసేజ్​లు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అలాంటి లింక్​లపై క్లిక్​ చేశారో అంతే సంగతులు : రుణమాఫీ అర్హలకు సంబంధించిన జాబితాలను మండలాలు, గ్రామాల వారీగా స్థానిక అధికారులు, అధికారపార్టీ నాయకులు వాట్సాప్​ గ్రూపుల్లో విడుదల చేస్తున్నారు. నేరగాళ్లు అలాంటి జాబితాలు, బ్యాంకుల లోగోలుండే వాట్సాప్ అకౌంట్​ల నుంచి నేరపూరిత వెబ్​లింక్​లు పంపిస్తున్నారు. వాటిని క్లిక్​ చేస్తే ఫోన్​ హ్యాక్​ అయ్యే అవకాశం ఉంది. దీనిద్వారా ఫోన్​ కాంటాక్ట్​ లిస్టలోని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు డబ్బు అవసరముందని మేసేజ్​లు పంపించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్​ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్​ఫ్రీ నంబర్​కు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.

ప్రజల కష్టాన్ని క్షణాల్లో కాజేస్తున్న సైబర్​ కేటుగాళ్లు - రాష్ట్రంలో రోజుకు రూ.5 - రూ.6 కోట్లు మాయం - Cybercrimes and economic offences rise in TG

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.