ETV Bharat / state

పార్లమెంటు పోరుకు కాంగ్రెస్ కసరత్తు - నేడు పీఈసీ భేటీలో అభ్యర్థుల ఎంపిక - తెలంగాణ కాంగ్రెస్ పీఈసీ మీటింగ్

Telangana Congress PEC Meeting Today : రాష్ట్రంలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ఇప్పటికే గాంధీ భవన్‌లో సిద్ధం కాగా ఇవాళ్టి భేటీలో ఈ జాబితాపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారిగా వడబోత కార్యక్రమం చేపట్టనున్న ఎన్నికల కమిటీ ప్రధానంగా ఇద్దరు లేదా ముగ్గురు నేతలను ఎంపిక చేయనుంది.

Congress MP Tickets Applications 2024
PEC Meeting In Gandhi Bhavan
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 7:10 AM IST

పార్లమెంటు పోరుకు కాంగ్రెస్ కసరత్తులు - నేడు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక

Telangana Congress PEC Meeting Today : పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు. ఇందులో పార్టీ నాయకులతో పాటు అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే ఎంపీ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా మరికొందరు పదవీ విరమణ పొందిన అధికారులు సైతం అర్జీ పెట్టుకున్నారు.

Congress MP Tickets Applications 2024 : పదిహేడు నియోజకవర్గాలకు సగటున ఒక్కో స్థానానికి 18 మందికి పైగా కాంగ్రెస్‌లో టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వరంగల్ టికెట్‌ కోసం 40 మంది, పెద్దపల్లిలో 29 మంది, భువనగిరి నుంచి 28 మంది అర్జీ పెట్టుకున్నారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్‌ టికెట్‌ కోసం కేవలం నలుగురు మాత్రమే ముందుకు రాగా జహీరాబాద్ నుంచి ఆరుగురు మాత్రమే దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

లోక్​సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!

Congress Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించగా ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి కోదండరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఫిరోజ్‌ఖాన్, చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాలస్వామి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్‌రెడ్డి, సర్వోత్తమరెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి, బండ్రు శోభారాణి, డాక్టర్ సూర్య పవన్‌రెడ్డి, కైలాస్‌ నేత టికెట్‌కు అర్జీ పెట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, మందా జగన్నాథం, చారకొండ వెంకటేష్, సంపత్‌కుమార్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, ఎ.చంద్రశేఖర్, పెరికి శ్యాం, మెదక్ నుంచి ఎం.భవానీరెడ్డి, బండారు శ్రీకాంత్, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే చేవెళ్ల నుంచి భీంభరత్, చిగురింత పారిజాతారెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, కిచెన్నగారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్, నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇరవత్రి అనిల్‌కుమార్, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, రుద్ర సంతోష్‌లు టికెట్ కోరుతున్నారు. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య, ఖమ్మం నుంచి మల్లు నందిని, రేణుకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత వీహెచ్ దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి , సీతాదయాకర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి నరేశ్‌యాదవ్, మహబూబాబాద్ నుంచి బలరాంనాయక్, కేసీ రాంనాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

Competition For Congress MP Tickets 2024 : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 స్థానాలకు కాంగ్రెస్‌ నేతలు 309 మంది దరఖాస్తు చేసుకోగా వీటికి సంబంధించి నియోజకవర్గాల వారీగా గాంధీవర్గాలు జాబితా సిద్ధం చేస్తున్నాయి. ఇవాళ జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో ఆశావహుల జాబితాపై చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ భేటీ జరగనుంది ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్‌చౌదరీ, సభ్యులు జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ కధమ్, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు, పీఈసీ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. వడపోత కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల వారీగా ఇద్దరు లేదా ముగ్గురు ప్రధాన నేతలను పరిశీలన చేసి, అర్హులైన వారిని కమిటీ ఎంపిక చేయనుంది. అదే విధంగా పార్టీ ఎన్నికల కార్యాచరణపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

తరలివచ్చిన ఆశావహులు - 300 దాటిన దరఖాస్తులు

కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం పోటాపోటీ - 140 దాటిన అర్జీలు - ఆ 3 స్థానాలపై ప్రముఖుల గురి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.