ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ

Telangana Congress Parliament Elections 2024 : పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. అర్హులైన నాయకులను గుర్తించేందుకు కసరత్తు కొనసాగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా వివరాలను ఈనెల 29లోగా పంపాలని డీసీసీలను పీసీసీ ఆదేశించింది. ఈనెల 30న సమావేశంకానున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిస్తుంది.

Congress Focus On MP Candidate Selection
Telangana Congress Focus On Parliament Elections 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 6:15 PM IST

లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు షురూ

Telangana Congress Parliament Elections 2024 : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. పార్లమెంటు ఎన్నికల బరిలో నిలబడేందుకు అర్హులైన నాయకులను గుర్తించేందుకు కసరత్తు కొనసాగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఎన్నికల బరిలో నిలబడేందుకు చొరవ చూపుతున్న నాయకుల వివరాలను 29వ తేదీ లోపల పంపాలని డీసీసీ లను పీసీసీ ఆదేశించింది. ఈ నెల 30వ తేదీన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించి కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి నివేదిస్తుంది.

Congress preparations for Lok Sabha Polls 2024 : లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ ముందస్తుగా వెలువడే అవకాశం ఉందనే ప్రచారంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని అన్ని రాష్ట్రాల పీసీసీలను ఏఐసీసీ ఆదేశించింది. రాష్ట్రాల కాంగ్రెస్ నాయకత్వాలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆశవహుల వివరాలను సేకరించే పనిలో పార్టీ నిమగ్నమైంది. ఈనెల 29 లోపు నాయకుల జాబితా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుల్ని పీసీసీ ఆదేశించింది.

పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!

Congress Focus On MP Candidate Selection For Loksabha Elections : రాష్ట్రంలోని 17ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు పంపే వివరాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలిస్తుంది. అర్హులైన వారిని ఎంపిక చేసి ఆ జాబితాను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. ఒక్కో స్థానంలో నలుగురైదురు నేతలు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. గెలుపు గుర్రాల ప్రతిపాదికన వీరి నుంచి అర్హుల్ని ఎంపిక చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించిన సిద్ధంగా ఉండేలా పీసీసీ సిద్ధమవుతోంది.

అవును నేను మేస్త్రీనే- తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని: సీఎం రేవంత్‌రెడ్డి

Congress Plan for Lok Sabha Elections : తాజా రాజకీయ పరిస్థితిని అంచనా వేసి క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులను సర్వేల ద్వారా గుర్తించి ఎవరనేది తేల్చాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలపై తుది నిర్ణయం ఉంటుందని పార్టీ సీనియర్‌ నాయకులు స్పష్టం చేస్తున్నారు. శాసన సభ ఎన్నికల్లో ఓటమిపాలైన వారికి సంవత్సరం పాటు ఏ పదవి ఇవ్వరాదని ఏఐసీసీ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐతే పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట్ల ఓటమి పాలైన వారితో పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతోంది.

వెయిట్ అండ్ వాచ్​ మోడ్​లో కాంగ్రెస్- బిహార్​లో మళ్లీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు!

'ఇండియా' కూటమికి నీతీశ్‌ గుడ్‌ బై? NDAలోకి ఎంట్రీ! అదే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.