ETV Bharat / state

రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - పార్టీ నేతల ఘన స్వాగతం - CM Revanth Landed in Hyderabad - CM REVANTH LANDED IN HYDERABAD

CM Revanth Landed in Hyderabad : రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. పర్యటన ముగించుకుని హైదరాబాద్​కు తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి బృందానికి ఎయిర్​పోర్ట్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు సీఎం పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు.

CM Revanth Landed in Hyderabad
CM Reached Landed in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 2:09 PM IST

Updated : Aug 14, 2024, 3:54 PM IST

CM Revanth Reaches Hyderabad : తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆగస్టు 3 నుంచి సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం ఉదయం 11 గంటలకి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకొని రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మరోవైపు ముఖ్యమంత్రి బృందం అమెరికా పర్యటనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు.

రాష్ట్రానికి రూ.31,532 కోట్ల పెట్టుబడులు : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చినందుకు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటించిన సీఎం మొత్తంగా రూ.31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఈనెల 11న దక్షిణ కొరియా రాజధాని సీయోల్​కు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై వారితో చర్చించారు.

బీఆర్ఎస్​పై మండిపడ్డ మంత్రి శ్రీధర్ బాబు : రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తమ బృందం ఏ టార్గెట్​తోనూ వెళ్లలేదని, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన ఆలోచనలు పంచుకునేందుకు మాత్రమే వెళ్లినట్లు స్పష్టం చేశారు. కాగా పెద్దమొత్తంలో పెట్టుబడులు రావడం హర్షించదగ్గ పరిణామం అని ఆయన తెలిపారు. తమ పర్యటన విఫలమైందని బీఆర్ఎస్ ఎద్దేవా చేసిందని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ భంగపడిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

"రాష్ట్రం ప్రగతి సాధించేందుకు ఎలాంటి ఆలోచనలతో ఉన్నామో తెలియజేసుందుకు అమెరికా వెళ్లాం. మా ఆలోచనలను వాళ్లు స్వాగతించారు. పెట్టుబడులను మేము ఆహ్వానించాం. కొందరు మాది హాలిడే ట్రిప్ అంటున్నారు. ప్లాప్ అంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యారు. ఇప్పటికీ చెబుతున్నా మాకు(ప్రభుత్వానికి) రాజకీయంగా ఎటువంటి భేషజాలు లేవు. సద్విమర్శలు చేస్తే తీసుకుంటాం, సలహాలు సూచనలు స్వీకరిస్తాం"- శ్రీధర్ బాబు, మంత్రి

హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ కంపెనీ విస్తరణ - సీఎం రేవంత్​ సమక్షంలో కుదిరిన ఒప్పందం

హైదరాబాద్ అభివృద్ధికి సహకరించండి - ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడికి సీఎం రేవంత్‌ విజ్ఞప్తి - CM Revanth America Tour Investments

Last Updated : Aug 14, 2024, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.