ETV Bharat / state

రోడ్డుపై బైఠాయించిన తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి - కేంద్రంపై ఆగ్రహం - TELANGANA CM REVANTH REDDY PROTEST

మణిపుర్‌లో అల్లర్లు, గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నిరసన

Revanth_Reddy_Comments
Telangana CM Revanth Reddy Protest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2024, 5:15 PM IST

TELANGANA CM REVANTH REDDY PROTEST : మణిపుర్‌ అల్లర్లు, గౌతమ్‌ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ‘చలో రాజ్‌భవన్‌’ చేపట్టారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

రహదారిపై బైఠాయించి సీఎం రేవంత్‌ నిరసన: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాజ్‌భవన్‌ సమీపంలో రహదారిపై బైఠాయించి సీఎం రేవంత్‌, మంత్రులు, నేతలు నిరసన తెలిపారు.

బీఆర్​ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలి: అదానీపై మాజీ సీఎం కేసీఆర్, బీఆర్​ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ తన వైఖరి ఏమిటో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదానీ అవినీతి, అక్రమాలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (JPC) వేయడానికి బీజేపీ చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఏఐసీసీ ఛలో రాజ్​భవన్‌ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

రాజ్‌భవన్‌కు దగ్గరలోనే పోలీసులు నిలుపుదల చేయడంతో అక్కడే బైఠాయించి ప్లకార్డులు పట్టుకుని అదానీకి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు. అదానీ అవినీతి, అక్రమాలపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అభియోగాలు మోపినప్పుడు జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏమిటని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

మణిపుర్‌ గత కొంత కాలంగా అల్లర్లతో అట్టడికి పోతోందని, ప్రధాని ఆ రాష్ట్రాన్ని సందర్శించి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్​ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే అదానీపై స్పందించడం లేదని ఆరోపించారు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్​ఎస్ కేంద్రానికి లొంగిపోయిందని ద్వజమెత్తారు. అందుకే అదానీపై బీఆర్​ఎస్ మాట్లాడటంలేదని విమర్శించారు. పార్లమెంట్‌లో బీఆర్​ఎస్ విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రపతి భవన్ వద్ద కూడా ధర్నా: మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని, వారిద్దరూ నాణానికి బొమ్మ, బొరుసులాంటి వారని విమర్శించారు. బీఆర్​ఎస్ జాయింట్‌ పార్లమెంటు కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తే, శాసనసభలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం వెల్లడించారు. దేశాన్ని దోచుకున్న అదానీపై జేపీసీ వేయడానికి ప్రధాని ఎందుకు సిద్ధంగా లేరని ప్రశ్నించిన రేవంత్‌ రెడ్డి, అదానీతో లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జేపీసీ వేయకపోతే అవసరమైతే రాష్ట్రపతి భవన్ వద్ద కూడా ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

'సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా' - అల్లు అర్జున్ ఘటనపై కేటీఆర్ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.