ETV Bharat / state

పరిశ్రమలు, సేవారంగాల్లో విస్తరించే స‌త్తా హైదరాబాద్‌కు ఉంది : ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ - CM Revanth with Foxconn Chairman - CM REVANTH WITH FOXCONN CHAIRMAN

Foxconn Chairman Meets CM Revanth : పారిశ్రామిక, సేవరంగాలతో పాటు అన్ని సెక్టార్లలో విస్తరించే సత్తా హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉంద‌ని అంత‌ర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే త‌న బృందంతో క‌లిసి హైద‌రాబాద్‌ను సంద‌ర్శిస్తాన‌ని తెలిపారు. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్​తో సమావేశమయ్యారు. ఫోర్త్‌సిటీపై రేవంత్‌రెడ్డి విజన్‌ను యాంగ్‌ లియూ కొనియాడారు.

CM Revanth with Foxconn Chairman Young Liu at Delhi
Foxconn Chairman Meets CM Revanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 1:51 PM IST

Updated : Aug 16, 2024, 2:25 PM IST

CM Revanth with Foxconn Chairman Young Liu at Delhi : ఇండ‌స్ట్రీ, స‌ర్వీస్ సెక్టార్ల‌తోపాటు అన్ని రంగాల్లో విస్త‌రించే స‌త్తా హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉంద‌ని అంత‌ర్జాతీయ దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ ఫాక్స్​కాన్ ఛైర్మ‌న్ యాంగ్ లియూ అన్నారు. ఫాక్స్​కాన్ ఛైర్మ‌న్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఆ కంపెనీ ప్ర‌తినిధి బృందం దిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ఆయ‌న అధికారిక నివాసంలో శుక్ర‌వారం ఉద‌యం స‌మావేశ‌మైంది. హైద‌రాబాద్ చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూల‌త‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్ బృందానికి వివ‌రించారు. 430 ఏళ్ల కింద పునాదిరాయి ప‌డిన హైద‌రాబాద్‌ కాలక్రమంలో మూడు న‌గ‌రాలుగా అభివృద్ధి చెందిన తీరును తెలిపారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేక‌పోవ‌డంతోనే హైద‌రాబాద్ వేగంగా పురోగ‌తి చెందుతోంద‌న్నారు.

అంత‌ర్జాతీయ విమానాశ్రయం, ఔట‌ర్ రింగు రోడ్డు, రీజిన‌ల్ రింగురోడ్డుతోపాటు హైద‌రాబాద్‌కు ఉన్న అన్ని అనుకూల‌త‌ల‌ను ఉన్నాయని రేవంత్​రెడ్డి ఫాక్స్‌కాన్ ప్రతినిధులకు వివ‌రించారు. హైదరాబాద్‌ అభివృద్ధిని మ‌రింత‌గా ప‌రుగులు పెట్టించేందుకు, భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు ఫ్యూచ‌ర్ సిటీ పేరుతో నాలుగో న‌గ‌రాన్ని నిర్మిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీలో విద్య, వైద్యం, క్రీడ, ఎల‌క్ట్రానిక్స్‌-ఎల‌క్ట్రిక‌ల్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగాల్లో బ‌హుముఖంగా అభివృద్ధి చేయ‌నున్నామ‌ని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవ‌స‌ర‌మైన నైపుణ్యాలను యువ‌త‌కు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ యూనివ‌ర్సిటీని ప్రారంభిస్తున్నామ‌న్నారు.

ఫోర్త్ సిటీ విజ‌న్ అద్భుతంగా ఉందని అభినందన : స్కిల్ యూనివ‌ర్సిటీకి ఆనంద్‌ మహీంద్రను ఛైర్మన్‌గా, శ్రీ‌నివాసరాజును వైస్‌ ఛైర్మన్‌గా నియ‌మించామ‌ని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఫాక్స్‌కాన్‌ను ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్య‌మంత్రి రేవంత్​రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం ప్రోత్సాహకాలను, ఇటీవల అమెరికా, దక్షిణకొరియా పర్యటనల వివరాలను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఫాక్స్‌కాన్‌ బృందానికి వివరించారు.

ఫోర్త్ సిటీ రూపకల్పన, పారిశ్రామిక అనుకూల విధానాలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనికత త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌ యాంగ్ లియూ అన్నారు. ఫోర్త్ సిటీ విజ‌న్ అద్భుతంగా ఉందంటూ రేవంత్‌రెడ్డిని అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలో హైద‌రాబాద్‌ను సంద‌ర్శిస్తాన‌ని తెలిపారు. అంత‌కుముందే తమ బృందం భాగ్యనగరాన్ని సందర్శిస్తుందని యాంగ్‌ లియూ చెప్పారు.

ఫాక్స్​కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ - 'స్నేహ పూర్వకంగా ఉండే విధానం అవలంభిస్తాం'

Last Updated : Aug 16, 2024, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.