ETV Bharat / state

ఆర్టీసీకి కొత్త కళ - కొత్త బ‌స్సుల కొనుగోలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ - CM Revanth on TGSRTC New Buses

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 7:54 AM IST

Updated : Sep 11, 2024, 9:42 AM IST

CM Revanth on TGSRTC : రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. స‌చివాల‌యంలో టీజీఎస్​ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన ఆయన, మ‌హాల‌క్ష్మి ప‌థకం అమలు తీరుపై ఆరా తీశారు.

CM Revanth about New Buses
CM Revanth on TGSRTC (ETV Bharat)

CM Revanth about New Buses : రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అవ‌స‌రాల‌కు అనుగుణంగా నూత‌న బ‌స్సుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరిగిన అవ‌స‌రాలు, నూత‌న మార్గాల‌ను ఇందుకు ప్రతిపాదికగా చేసుకోవాల‌ని సూచించారు. టీజీఎస్​ ఆర్టీసీపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి స‌మీక్ష నిర్వహించారు. మ‌హాల‌క్ష్మి ప‌థకం మ‌హిళ‌లు వినియోగించుకుంటున్న తీరుపై ఆరా తీశారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అద్భుతంగా ఉంద‌ని, ఇప్పటి వ‌ర‌కు 83.42 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్రయాణం చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

పథకం ద్వారా మ‌హిళా ప్రయాణికుల‌కు రూ. 2 వేల 840 కోట్లు ఆదా అయ్యినట్లు సీఎం రేవంత్​కు మంత్రి పొన్నం వివరించారు. 7,292 బ‌స్సుల్లో మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం వ‌ర్తిస్తోంద‌ని, ఇది ప్రారంభ‌మైన త‌ర్వాత జిల్లాల నుంచి హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్న మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. అందుకు సంబంధించి ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌ను ముఖ్యమంత్రికి అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్రజెంటేష‌న్‌ ద్వారా చూపారు. అనంత‌రం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భ‌విష్యత్ నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు త‌దిత‌రాలకు క‌లిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు వివ‌రించారు.

అప్పుల రీక‌న్‌స్ట్రక్షన్‌పై అధ్యయ‌నం : బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌కు చెల్లిస్తున్న వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు, అప్పుల రీక‌న్‌స్ట్రక్షన్‌పై అధ్యయ‌నం చేయాల‌ని సీఎం అధికారులను ఆదేశించారు. సంస్థపై క్రమంగా రుణ‌భారం త‌గ్గించాల‌ని సూచించారు. మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంతో ఆక్యుపెన్సీ రేటు పెర‌గ‌డంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబ‌ర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వ‌స్తోంద‌ని అధికారులు వివరించారు. స‌మీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్‌ రెడ్డి, షాన‌వాజ్ ఖాసీం, ర‌వాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి వికాస్ రాజ్‌, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ స‌జ్జనార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొత్త బస్సుల కొనుగోలుపై త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది.

కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు : సీఎం రేవంత్​రెడ్డి - CM Revanth Koti Womens University

'దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ - భారీ రుణమే రాష్ట్రానికి పెను భారంగా మారింది' - 16th Finance Committee Meeting

Last Updated : Sep 11, 2024, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.