ETV Bharat / state

మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు - కేబినెట్​ భేటీలో నిర్ణయం - Telangana Cabinet Meeting Decisions - TELANGANA CABINET MEETING DECISIONS

Telangana Cabinet Decisions 2024 : జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పగించారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు.

CM Revanth Cabinet 2024
Telangana Cabinet Meeting Points (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 20, 2024, 8:31 PM IST

Updated : May 20, 2024, 8:58 PM IST

Telangana Cabinet Meeting Decisions 2024 : అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని, కనీస మద్దతు ధరకే కొనాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈసీ అనుమతితో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ అంశాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు.

ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు, మంత్రివర్గ సమావేశం అనంతరం తెలంగాణ సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజలకు, విద్యార్థులకు 36 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం అవసరం ఉందన్న మంత్రి, ఆ మొత్తం రాష్ట్రంలోనే సేకరిస్తామన్నారు.

"గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకే కొనటానికి కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించటం కూడా జరిగింది. రాష్ట్రంలో ఉన్న రైతన్నలెవరూ కూడా ఆందోళన చెందొద్దు. వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను."-పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర సమాచారశాఖ మంత్రి

మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు - కేబినెట్​ భేటీలో నిర్ణయం (ETV Bharat)

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు : ఇందుకోసం సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల ఆధునీకీకరణకు, సుమారు రూ.600 కోట్లు కేటాయిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై, మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

జూన్‌ 2 నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతుందన్న మంత్రి, రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఆహ్వానించి సన్మానించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు అనుమతి కోసం ఈసీఐకి లేఖ రాయాలని నిర్ణయించారు.

TS Cabinet Discussed on Kaleshwaram NDSA Report : కేబినెట్​లో మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా చర్చించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనలకనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే, సరి అవుతుందన్న గ్యారంటీ లేదని, నీరు నిల్వ చేసే పరిస్థితి కూడా లేదని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ చెప్పిందని వివరించారు. అందుకే, తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసైనా సరే రైతులకు నీరు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లదే - కేబినెట్ భేటీలో నిర్ణయం - Telangana Cabinet Meeting Today

జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి - అపరిష్కృత విభజన అంశాలపై సీఎం రేవంత్​ ఫోకస్ - Telangana Cabinet Meeting May 18th

Last Updated : May 20, 2024, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.