ETV Bharat / state

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు ఉభయసభల్లో చర్చ - Telangana Budget Sessions 2024 to25

Telangana Budget Sessions 2024 : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ఉభయసభల్లో చర్చ జరగనుంది. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. శనివారం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. బడ్జెట్​కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు.

Telangana Budget Sessions 2024
Telangana Budget Sessions 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 6:44 AM IST

Updated : Feb 9, 2024, 6:56 AM IST

Telangana Budget Sessions 2024 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజున ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ శాసనసభ, మండలిలో చర్చ జరగనుంది. ఉదయం ఉభయసభలు సమావేశం కాగానే నేరుగా చర్చ చేపడతారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదిస్తారు. మరో సభ్యుడు యెన్నం శ్రీనివాస్​రెడ్డి ఆ ప్రతిపాదనను బలపరుస్తారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మరో సభ్యుడు మహేశ్​కుమార్ గౌడ్ ఆ ప్రతిపాదనను బలపరుస్తారు.

Governor Speech in Telangana Budget Sessions 2024 : అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CMRevanth Reddy) చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు. అటు రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్​ను శనివారం ప్రవేశపెడుతున్నారు. కేబినెట్​లో పద్దుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.

గవర్నర్​ ప్రసంగం పేలవంగా ఉంది - ప్రభుత్వం తన విజన్​ను​ ఆవిష్కరించలేదు : హరీశ్​రావు

Telangana Cabinet Meeting Today : మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage) కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగం ఇచ్చిన నివేదికపై మంత్రివర్గం భేటీలో చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ భావించింది. అయితే, న్యాయమూర్తుల కొరత ఉన్నందున జడ్జిలను ఇవ్వలేమని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. విశ్రాంత న్యాయమూర్తిచే విచారణ చేయించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న విషయమై కేబినేట్​లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు, ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని గురువారం బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 9, 10, 12, 13వ తేదీల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొదటిసారి కొలువైన కాంగ్రెస్ సర్కార్ తొలి బడ్జెట్​ను ప్రవేశపెడుతుంది.

నాలుగు రోజులపాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై

Last Updated : Feb 9, 2024, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.