ETV Bharat / state

సైబర్ టీమ్, టీజీన్యాబ్​ బలోపేతం దిశగా సర్కార్ బడ్జెట్ కేటాయింపులు - TG Budget for Home Department - TG BUDGET FOR HOME DEPARTMENT

Telangana Budget 2024 : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​లో హోం శాఖకు ప్రభుత్వం ఈ ఏడాది రూ. 9,564 కోట్లు కేటాయించింది. ప్రధానంగా సైబర్ సెక్యురిటీ విభాగానికి, టీజీన్యాబ్‌ బలోపేతానికి అధిక నిధులు కేటాయించింది. సైబర్‌ సెక్యూరిటీకి గతేడాది 9 కోట్ల రూపాయలు కేటాయించగా ఈ ఏడాది పెంచి రూ.15 కోట్లు కేటాయించారు. సైబర్‌ నేరాల కట్టడికి సాంకేతికత, కొనుగోలు, నిర్వాహణకు ప్రాధాన్యమిచ్చినట్టుగా తెలుస్తోంది. మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేకంగా ఏర్పాటైన తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు గతేడాది రూ. 8.50 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 20 కోట్లు కేటాయించారు. మొత్తం 510 వాహనాలు యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు సమకూర్చనున్నారు.

Telangana Budget for Home Department
Telangana Budget 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 7:28 PM IST

Telangana Budget for Home Department : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​లో హోం శాఖకు చెందిన పలు విభాగాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో విభాగాలకు గతంలో కంటే భారీగా నిధులు పెంచారు. ఇటీవల సైబర్ నేరాలు, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించిన పోలీసులకు మద్దతుగా ప్రభుత్వం వారికి కేటాయించిన నిధులను భారీగా పెంచింది.

హైదరాబాద్​పై నిధుల వర్షం! : సైబర్‌ సెక్యురిటీ బ్యూరోకు గతేడాది రూ.3.33 కోట్లు ప్రతిపాదించగా ఈ ఏడాది అయిదింతలు పెంచి రూ.15 కోట్లు కేటాయించారు. యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు గతేడాది రూ.8.50 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించారు. డీజీపీ, ఐజీ శాఖాధిపతులకు రూ.374.48 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే ఈ ఏడాది రూ. 100 కోట్లు తగ్గించారు. కీలకమైన హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ విభాగానికి అత్యధికంగా రూ. 276.44 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. నగరంలో మరో కీలకమై కమిషనరేట్ అయిన సైబరాబాద్​కు రూ.20 కోట్లు కేటాయించారు. రాచకొండ కమిషనరేట్​కు రూ.9.40 కోట్లు కేటాయించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి రూ.20 కోట్లు, జైళ్ల శాఖకు రూ.16.78 కోట్లు కేటాయించారు.

గ్రేహౌండ్స్‌ నిధుల్లో కోత : విపత్తు నిర్వహణ, ఫైర్ సర్వీసులకు రూ.26.39 కోట్లు, సైనిక సంక్షేమానికి రూ. 3.33 కోట్లు, పోలీసు నియామక మండలికి రూ.3 కోట్లు, భరోసా కేంద్రాలకు రూ.50 లక్షలు, మహిళా భద్రత విభాగానికి రూ.76 లక్షలు, ఇంటెలిజెన్స్‌కు రూ.108 కోట్లు, డీజీ పరిరక్షణ దళానికి రూ.3.50 కోట్లు, గ్రేహౌండ్స్‌ విభాగానికి గతేడాది 3.19 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.1.94 కోట్లు మాత్రమే కేటాయించారు.

టీజీన్యాబ్​కు రూ.20 కోట్లు : ఆక్టోపస్‌ విభాగానికి రూ.4.94 కోట్లు, టీజీఎస్పీ బెటాలియన్లకు రూ.3.26 కోట్లు, ట్రాఫిక్‌ విభాగానికి కోటి రూపాయలు, కొత్తగా ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణకు రూ.71.55 కోట్లు, జిల్లా పోలీసు ఫోర్స్​కు రూ. 22 కోట్లు, ఫోరెన్సిక్‌ విభాగానికి రూ. 2.23 కోట్లు, కొత్త పోలీస్‌స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణానికి రూ. 90 కోట్లు, వరంగల్‌లో కమిషనరేట్‌ భవనానికి 10 కోట్ల రూపాయలు కేటాయించారు. జిల్లాలలో ఆఫీస్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి రూ. 85 కోట్లు, పోలీసు అకాడమీకి రూ.284 కోట్లు, పోలీసు సంక్షేమానికి రూ.5 కోట్లు కేటాయించారు. పోలీసు స్టేషనరీ, ముద్రణ విభాగానికి రూ.8 లక్షలు బడ్జెట్​లో కేటాయించారు.

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్​ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే? - TELANGANA BUDGET 2024

బడ్జెట్​లో వ్యవసాయరంగానికి పెద్దపీట - రూ.72,659 కోట్లు కేటాయింపు - telangana budget 2024 highlights

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.