Telangana Assembly Monsoon Sessions From July 24th : ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖాధికారులతో సమీక్షంచారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, అదనపు డీజీ మహేశ్‌కుమార్ భగవత్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఛీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, జీఏడీ అధికారులు హాజరయ్యారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. సమావేశ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, రామ చందర్ నాయక్ కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో ఆర్థిక శాఖ అధికారులతో కూడా స్పీకర్ చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాతే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండటంతో అందుకు తగ్గట్లు అధికారులు సిద్ధం కావాలని సూచించారని సమాచారం.