ETV Bharat / state

డ్రగ్స్ సరఫరాపై టీజీన్యాబ్‌ ఉక్కుపాదం - అమ్మినా, కొన్నా కఠిన చర్యలు - TGNAB Focus On Drugs In Hyderabad

TGNAB Focus On Drugs In Hyderabad : మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్రంలో ఏర్పాటైన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సత్ఫలితాలను ఇస్తోంది. మత్తుపదార్థాల సరఫరాదారులు, పెడ్లర్లు, వినియోగదారులపై ప్రత్యేక నిఘా పెట్టిన బ్యూరో కీలకమై డ్రగ్ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టింది. పబ్బులు, విద్యాసంస్థలపై దృష్టిసారించి హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటిలిజెన్స్‌తో నేరగాళ్లను ఇట్టే పట్టేస్తోంది. వినియోగదారులపైనా కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇస్తూనే డ్రగ్స్ డాన్‌ల భరతం పడుతోంది.

TGNAB Focus On Drugs In Hyderabad
TGNAB Focus On Drugs In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 1:37 PM IST

TGNAB Focus On Drugs In Hyderabad : రాష్ట్రంలో డ్రగ్స్‌ మాటే వినిపించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయగా వాటి నిర్మూలనకు ఏర్పాటైన యాంటీ నార్కొటిక్ బ్యూరో మాదకద్రవ్యాల మూలాలనే పెకలించే పనిలో ఉంది. ఇందుకోసం బ్యూరో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారు. డ్రగ్స్ సేవిస్తున్న, విక్రయిస్తున్న వారు ఎంతటి వారైనా పోలీసులు ఉపేక్షించడం లేదు. కొన్ని నెలలుగా కీలక ఆపరేషన్లు టీజీ న్యాబ్ నిర్వహించింది.

డ్రగ్స్​ సరఫరాపై పోలీసుల ఉక్కుపాదం : ఇటీవల హైటెక్ సిటీ నోవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌ డ్రగ్ పార్టీలకు హాట్ స్పాట్‌గా ఉన్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టింది. ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. మణికొండలోని కేవ్ పబ్‌లో చేసిన రైడ్‌లో 52 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా వారిలో 33 మందికి డ్రగ్ పాజిటివ్‌ వచ్చింది. వారంతా గంజాయి, కొకైన్ సేవించినట్లు గుర్తించారు. పలు విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్ సేవిస్తున్న విద్యార్థులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిలో పరివర్తన కోసం కౌన్సిలింగ్ ఇచ్చారు.

TGNAB Officials Focus On Drugs Control : నెల రోజుల క్రితం షాద్‌నగర్‌లోని సింబయాసిస్ కళాశాలో ఓజీ వీడ్ డ్రగ్ వినియోగిస్తున్న 25 మంది వైద్య విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో ఓజీ వీడ్ డ్రగ్ సేవిస్తున్న ఆరుగురు జూడాలను టీజీ న్యాబ్ పోలీసులు పట్టుకున్నారు. వీరిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. గురునానక్ కళాశాలలో గంజాయి సేవిస్తున్న 15 మంది విద్యార్థులను గుర్తించిన పోలీసులు వారిని రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు పంపారు.

ఈ- సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు : కుందన్‌బాగ్‌లో ఉన్న కలినరీ అకాడమీలోని నలుగురు విద్యార్థులకు గంజా పాజిటివ్ వచ్చింది. సీబీఐటీలో ఒకరు, బాసర ట్రిఫుల్​ఐటీలో పలువురు, జేఎన్​టీయూ జోగిపేటలోని ముగ్గురు విద్యార్థులకు గంజా పాజిటివ్‌ వచ్చినట్లు టీజీ న్యాబ్ పోలీసులు తెలిపారు. సీబీఐటీ, ఇండస్‌ స్కూలు విద్యార్థులకు కోడ్ భాషలతో ఈ- సిగరెట్లు విక్రయిస్తున్న అహ్మద్, జాఫర్‌ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

ఎన్​ఐటీ తిరుచ్చిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు డ్రగ్స్ వినియోగంతో కళాశాల నుంచి సస్పెండ్ అయ్యాడు. ఆ అవమానంతో తండ్రి ఉద్యోగానికి రాజీనామా చేయగా తల్లి మంచం పట్టింది. ప్రస్తుతం ఆ యువకుడిని డీఎడిక్షన్ సెంటర్‌కు పంపించారు. పలు పబ్బుల్లో మైనర్లకు మద్యం సరఫరా చేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశారు.

డ్రగ్స్​ వినియోగం- అనర్థాలపై అవగాహన కల్పిస్తూ : డ్రగ్స్ వ్యవహరంలో విద్యాసంస్థలపైనా పోలీసులు నిఘా పెట్టారు. వాటివల్ల కలిగే అనర్ధాలపై టీజీ న్యాబ్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు, విద్యార్థులను వాలంటీర్లుగా చేసి సమాచారాన్ని రాబడతున్నారు. సినీ, క్రీడా ప్రముఖులతో మాదకద్రవ్యాల వల్ల తలెత్తే దుష్పరిణామాలను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం - ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయించే ముఠా అరెస్ట్

మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా - టీఎస్‌ న్యాబ్‌ బలోపేతానికి అధికారుల ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.