ETV Bharat / state

కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ - సాగునీటికి రూ.29 వేల కోట్లు! - వడ్డీ చెల్లింపులకే 60 శాతం కేటాయింపులు - Irrigation Allocations in TG Budget

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 9:16 AM IST

Telangana budget 2024 Today : రాష్ట్ర బడ్జెట్​లో సాగునీటి పారుదల రంగానికి భారీగా నిధులు కేటాయింపులు ఉండనున్నాయి. సుమారు రూ.29,000 కోట్లు నిధులు ఇవ్వనున్నారు. కానీ ఆ నిధుల్లో ఎక్కువ మొత్తం వడ్డీల చెల్లింపులకే వెళ్లనున్నాయి. కేవలం రూ.9వేల కోట్లు మాత్రమే కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించారనే సమాచారం.

Telangana budget 2024 Today
Telangana budget 2024 Today (ETV Bharat)

Irrigation Sector Allocations in Telangana budget 2024 : రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్​ను నేడు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈక్రమంలో ఏఏ రంగాలకు బడ్జెట్​లో ఎంత మొత్తం వెచ్చిస్తారో అనేది తెలియాల్సి ఉంది. ఎక్కువ మొత్తం వ్యవసాయశాఖకు కేటాయించగా ఆతర్వాత సాగునీటి పారుదల రంగానికి సుమారు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు తెలిసింది. కానీ ఇందులో సింహభాగం మాత్రం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి, వడ్డాలు చెల్లించడానికే కేటాయింపులు చేసినట్లు సమాచారం.

ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9 వేల కోట్లు : రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేస్తామని చెబుతూ వస్తోంది. కానీ వీటి అవసరాలకు తగ్గట్లుగా నిధులు కేటాయించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, వరద కాలువ, దేవాదుల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు తీసుకున్న రుణాల్లో కొన్నింటికి అసలు తిరిగి చెల్లింపు ప్రారంభమైంది.

ఇంకా మిగిలిన వాటికి వడ్డీ కట్టాల్సి ఉంది. వీటన్నిటికీ కలిపి రూ. 18 వేల కోట్లు తప్పనిసరిగా కేటాయించాల్సిందేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. నీటిపారుదలశాఖలో ఉద్యోగుల జీతభత్యాలు, ఎస్టాబ్లిష్​మెంట్​లకు రూ.2వేల కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.9వేల కోట్లును ప్రాజెక్టుల నిర్మాణానికి కేటాయించే అవకాశంఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రాధాన్య ప్రాజెక్టులకు ఏ మేరకు ఇస్తారో : తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులకు ఈ బడ్జెట్​లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన నిధులు కేటాయించే అంశంపై గత కొన్ని రోజులుగా మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. మరి ఎంతవరకు బడ్జెట్​లో కేటాయింపులు ఉంటాయో చూడాలి. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో శ్రీశైలం ఎడమగట్టు కాలు(ఎస్​ఎల్​బీసీ), డిండి, భీమా, కోయిల్​సాగర్​, నెట్టెంపాడు, కల్వకుర్తి, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల, మోదికుంటవాగు, చిన్న కాళేశ్వరం, నీల్వాయి, లోయర్​ పెన్​గంగ, చనాఖా-కోర్ట, పాలెంవాగు, ఎల్లంపల్లి, శ్రీరామసాగర్​ రెండో దశ, సదర్మాట్​ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.

వీటన్నింటికీ సుమారు రూ.8 వేల కోట్లు అవసరమని, ఈ మేరకు ఖర్చు చేస్తే సుమారు 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి అవకాశం ఉందని నీటిపారుదల శాఖ నివేదించినట్లు సమాచారం. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు, భూసేకరణకు రూ.6,130 కోట్లు అవసరమని ఆ ప్రాజెక్టు ఇంజినీర్లు నివేదించారు. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల కింద ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని ఆయకట్టుకు నీరందించే పనులను ప్రాధాన్యత జాబితాలో చేర్చారు. ఇందుకు రూ.1,600 కోట్లు కేటాయించే అవకాశం ఉంది.

నారాయణపేట-కొడంగల్​ ఎత్తిపోతలకు రూ.1000 కోట్లు : ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్​కు నీరందించే నారాయణపేట-కొడంగల్​ ఎత్తిపోతలకు త్వరలోనే టెండర్​ ప్రక్రియ ప్రారంభం కానుంది. పనులు, భూసేకరణకు రూ.1000 కోట్లు కేటాయించాలని సంబంధిత ఇంజినీర్లు ప్రతిపాదించారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టాలన్న రుణాలు తిరిగి చెల్లించడం, వడ్డాలు కట్టడానికి ఎక్కువ మొత్తం బడ్జెట్​లో కేటాయింపులు చేయడంతో వీటికి నిధులు కొరత వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

నేడే తెలంగాణ బడ్జెట్ - వ్యవసాయం, సంక్షేమ రంగాలకే మొదటి ప్రాధాన్యత - TELANGANA BUDGET 2024 TODAY

ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడమే లక్ష్యం - 19వేల కోట్లతో 19 ప్రాజెక్టుల పనులు - Govt Focus On Irrigation Projects

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.