ETV Bharat / state

ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ - AP TEACHER MLC BY ELECTION POLLING

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభం

AP Teacher MLC By Election Polling
AP Teacher MLC By Election Polling (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 11:55 AM IST

AP Teacher MLC By Election Polling : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గోదావరి జిల్లాల్లోని 113 మండలాల్లో మొత్తం 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఉప ఎన్నికలో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటును సంఖ్య రూపంలో వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో నంబర్​ ఉంటుంది. ఓటరు తన ప్రాధాన్యతలో ‘1’ సంఖ్య తప్పకుండా వేయాలి. లేదంటే అది చెల్లదు. పోటీలోని అభ్యర్థులందరికీ ప్రాధాన్యం ఇస్తూ ఓటేసే వెసులుబాటు ఉంది.

అభ్యర్థులకు బ్యాలెట్‌ పేపరులో నంబర్లు కేటాయించారు. 1వ నంబర్ గంధం నారాయణరావుకు , దీపక్‌ పులుగుకు 2, డాక్టర్‌ నాగేశ్వరరావు కవలకు 3, నామన వెంకటలక్ష్మి(విళ్ల లక్ష్మి)కు 4, బొర్రా గోపీమూర్తికి 5వ సంఖ్యను కేటాయించారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 92వ పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 896 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా అల్లూరి జిల్లా వై రామవరం మండలం డొంకరాయి ఏడో నెంబర్ పోలింగ్ కేంద్రంలో ముగ్గురు ఉన్నారు.

AP Teacher MLC Elections 2024 : రెవెన్యూ, పోలీసు అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి సరళిని పరిశీలిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేందుకు శిబిరాలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వెళ్తున్న ఉపాధ్యాయులను, అధ్యాపకులను తమ అభ్యర్థికి మద్దతుగా ఓటేయాలని కోరుతున్నారు. రాజకీయ పార్టీల సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయని భావిస్తున్నప్పటికీ, పార్టీలు, కార్మిక సంఘాల మద్దతుతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

రాజ్యసభ ఉప ఎన్నికలు - కూటమి అభ్యర్థులు కొలిక్కి!

'రాజ్యసభ'లో మూడు కుర్చీలు - రేసులో నాగబాబు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.