ETV Bharat / state

కూటమి గెలుపు ఖాయం - టీడీపీ వర్క్​షాప్​లో నేతల ధీమా - TDP Workshop - TDP WORKSHOP

TDP Workshop: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేస్తే వైసీపీకి సింగల్ డిజిట్‌ మాత్రమే వస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. విజయవాడలోని ఎ కన్వెన్షన్‌లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన, బీజేపీ ప్రతినిధులు సైతం హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల హక్కులు, వైసీపీ కుట్రలపై చర్చించారు.

TDP_Workshop
TDP_Workshop
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 2:04 PM IST

కూటమి గెలుపు ఖాయం - టీడీపీ వర్క్​షాప్​లో నేతల ధీమా

TDP Workshop: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో విజయవాడలోని ఎ కన్వెన్షన్‌లో చంద్రబాబు వర్క్‌షాప్‌ నిర్వహించారు. అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గ ఇన్‌ఛార్జులు హాజరయ్యారు.

అదే విధంగా జనసేన, బీజేపీ ప్రతినిధులు సైతం ఈ వర్క్​షాప్​కు హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల హక్కులు, వైసీపీ కుట్రలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపైనా చర్చ జరిగింది. అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహాలను నేతలకు చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

అయిదు కోట్ల ఆంధ్రుల కోసమే పొత్తు: ఎన్ని ఇబ్బందులు సృష్టించినా కష్టపడి నిలదొక్కుకున్నాం కాబట్టే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. పొత్తులు 5 కోట్ల ఆంధ్రుల కోసమే అని గుర్తించి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. తమపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అని పోలీసుల్ని అభ్యర్థులు ఆశ్రయించే దౌర్భాగ్య స్థితి నెలకొందని విమర్శించారు. విశాఖను రాజధాని అని చెప్పి డ్రగ్స్ కేంద్రంగా జగన్ గ్యాంగ్ మార్చేసిందని మండిపడ్డారు. డ్రగ్స్ రవాణాలో అడ్డంగా దొరికిపోయి తెలుగుదేశంపై నిందలు మోపటం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేస్తే వైసీపీకి సింగల్ డిజిట్‌యే వస్తుందని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టీడీపీ వర్క్ షాప్ - TDP workshop with MLA MP candidates

క్షేత్రస్థాయిలో సమన్వయం ఎంతో కీలకం: క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన బీజేపీల సమన్వయం ఎంతో కీలకమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ 3 పార్టీలు ఎన్నికల మూడ్​లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. కష్టపడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ప్రతీ ఒక్కరూ గుర్తించి ముందుకు సాగాలని సూచించారు. ప్రతీ చిన్న విషయం అధిష్ఠానమే పరిష్కరించాలనే ధోరణి కింది స్థాయిలో మారాలని హితవు పలికారు.

ఎక్కడ తగ్గాలో అనే మాట జనసేన నిజం చేసింది: ఎన్డీఏ తొలి బహిరంగ సభలో రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై జాతీయ నాయకత్వం ఓ స్పష్టత ఇవ్వలేదనే భావన అందరిలోనూ ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ శ్రీపాద సత్యనారాయణ స్పష్టం చేశారు. సామాజిక వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఆపాలంటే ఎన్డీఏ కూటమి రాజ్యాధికారం పొందాలని తేల్చి చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల న్యాయ విభాగం సమన్వయం ఎంతో కీలకమన్నారు. ఎక్కడ తగ్గాలో అనే మాట సినిమాలోనే కాదు, రాజకీయాల్లోనూ జనసేన నిజం చేసిందని వెల్లడించారు.

అందరం కలిసి పనిచేద్దాం - వ్యక్తిగతం కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యం: ఆలపాటి రాజా - TDP Alapati Raja Comments

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.