ETV Bharat / state

పింఛన్ల నిధులను బిల్లులకు చెల్లించారు- పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షంపై విషప్రచారం: టీడీపీ నేతలు - pension distribution in ap - PENSION DISTRIBUTION IN AP

TDP Leaders Fires on YSRCP: పింఛన్లు పంపిణీ చేయకుండా తెలుగుదేశం అడ్డుపడుతోందంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు తెలుగుదేశం వ్యతిరేకం కాదని. పింఛన్ల నిధులను సొంత మనుషులకు చెల్లించారని ఆరోపించారు. దాన్ని పక్కదారి పట్టించేందుకే టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Etv BhTDP_Leaders_Fires_on_YSRCParat
Etv BhTDP_Leaders_Fires_on_YSRCParat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 10:19 PM IST

TDP Leaders Fires on YSRCP: పెన్షన్ పంపిణీ చేయకుండా తెలుగుదేశం అడ్డుపడుతుందంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ధ్వజమెత్తారు. ఈ మేరకు వైసీపీ నేతలు వలంటీర్లకు వాయిస్ మెసేజ్‍లు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్ పంపిణీ నిలిపివేశారని ఇవాళ ఉదయాన్నే పెన్షన్ దారులకు ఈ సందేశం చెప్పాలని ఆదేశాలిచ్చారని మండిపడ్డారు.

మన అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‍ను ఆపింది టీడీపీ నేతలే అని ప్రతి ఒక్క గడపకు వెళ్లి చెప్పాలని సందేశాలిచ్చారంటూ దుయ్యబట్టారు. రెండు నెలల్లో జగనన్న ప్రభుత్వంలో మళ్లీ ప్రతి నెలా ఘనంగా నిర్వహిస్తారని కూడా చెప్పాలని వాయిస్ మెసెజ్​లు పంపారని విమర్శించారు. వైసీపీ విషప్రచారాన్ని సీరియస్‍గా తీసుకున్న కూటమి నేతలు, కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాలను వైసీపీ వక్రీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం ఇవ్వాల్సిన 2 వేల కోట్లను జగన్, బుగ్గన బిల్లుల రూపంలో అస్మదీయులకు చెల్లించారని ఆరోపించారు. ఖజానాలో డబ్బులు లేకుండా చేసి ఇప్పుడు తెలుగుదేశంపై అభాండాలు వేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు.

పింఛన్ల పంపిణీపై సెర్ప్‌ కీలక ఉత్తర్వులు- కోడ్‌ ముగిసేవరకు ఇంటింటికీ ఉండదు - SERP orders on AP pensions

Varla Ramaiah Comments on Volunteers: ఎన్ని దొడ్డి దారులు తొక్కైనా, దొంగ దారులు వెతుక్కొని అధికారంలోకి రావాలని జగన్ రెడ్డి చూస్తున్నాడని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. పెన్షన్ పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఈసీ ఉత్తర్వులివ్వగానే జగన్​కి ఒళ్లంతా జెర్రిలు పాకుతున్నట్లైందని దుయ్యబట్టారు. సోమవారం పెన్షన్ల పంపిణీ సజావుగా సాగాలని, ఏ ఒక్క పెన్షన్‌దారుడు కూడా ఇబ్బంది పడకుండా చూడాలని చంద్రబాబు సీఎస్‌కు, సీఈవో మీనాకు లేఖలు రాశారని గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు తెలుగుదేశం వ్యతిరేకం కాదని వర్ల రామయ్య స్పష్టం చేశారు. వాలంటీర్లను జగన్‌ బానిసల్లాగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మెరుగైన రీతిలో వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు

పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోండి - సీఎస్​కు లేఖరాసిన నిమ్మగడ్డ - Nimmagadda writes letter to CS

Payyavula Keshav Comments: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఈ నెల పింఛన్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయాల వద్ద చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం, గ్రామ స్థాయి వరకు తమ యంత్రాంగం ఉందన్న ప్రభుత్వం, పింఛన్ల పంపిణీ చేయడానికి మాత్రం వారు ఇంటింటికి వెళ్లడానికి సిద్ధంగా లేరన్న సంకేతాన్ని ఇవ్వడం దారుణమన్నారు. వాలంటీర్లు ఇవ్వొద్దని కోరామే గానీ, సచివాలయ ఉద్యోగులు ఇంటికి పోయి ఇవ్వొద్దని ఎవరూ చెప్పలేదన్నారు.

Gurajala Malyadri on Pension Issue: పింఛన్ల పంపిణీ ఆలస్యానికి జగన్ రెడ్డే కారణమని టీడీపీ నేత గురజాల మాల్యాద్రి ధ్వజమెత్తారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమిషన్ కాదని గుర్తుచేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మల్యాద్రి డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇంటివద్దకే నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్‌ అందిస్తోందన్నారు.

పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి - సీఎస్​, ఈసీకి చంద్రబాబు లేఖ - chandrababu naidu letter to cs

'పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ విష ప్రచారం చేస్తోంది - వాలంటీర్ల వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.