YCP anarchy in AP: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అయితే, అధికార వైసీపీ శ్రేణులు మాత్రం ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లోకి చొచ్చుకెళ్లారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో వైఫల్యాలపై కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఈసీ అధికారులకు, టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అందించారు. చంద్రబాబు లేఖతో పాటు మరో 11 ఫిర్యాదులు ఈసీకి అందజేశారు. రాష్ట్రంలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్నిచోట్ల వైసీపీ నేతలు హింసకు పాల్పడినట్లు వెల్లడించారు. కూటమి శ్రేణులపై దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలకు సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నార. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ నాయకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. తెనాలి, తాడిపత్రి, నరసరావుపేట వైసీపీ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్నాడు, తాడిపత్రి, పులివెందుల, ఇతరచోట్ల హింసాత్మక ఘటనలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలు విఫలమయ్యాయని ఈసీ దృష్టికి తెచ్చినట్లు కనకమేడల పేర్కొన్నారు. పలుచోట్ల పోలింగ్ నిలిపివేయడంపై కూటమి నేతల్లో ఆందోళన నెలకొందన్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన చోట మరోసారి పోలింగ్ చేపట్టాలని కూటమి నేతలు ఈసీని కోరారు.
తాాడిపత్రిలో బరితెగించిన వైసీపీ కార్యకర్తలు - బాలింత అని చూడకుండా - YCP Leaders Attack
రాష్ట్ర ఎన్నికల సంఘానికిి ఫిర్యాదు: రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై బీజేపీ నేతలు సైతం ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో ఏపీ ఎన్నికల్లో హింస జరుగుతోందని ఫిర్యాదులో వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్నారు. వైసీపీ చర్యలతో చాలామంది ఓటు వేయకుండానే వెళ్లిపోయారని ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. అరాచకాలతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు.
మాచర్లలో ఎన్డీఏ నేత హత్యకు గురైనా పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి శ లావు శ్రీ కృష్ణదేవరాయలుపై దాడిని ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన పోలింగ్ ఏజెంట్ ను ఈ ఉదయం కిడ్నాప్ చేశారని వెల్లడించారు. తాడిపత్రిలో పోలింగ్ ఏజెంట్‌ను వైకాపా ఎమ్మెల్యేలు బెదిరించారన్నారు.
ప్రకాశం జిల్లా దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చర్ చేపట్టారని బీజేపీ నేతలు ఆరోపించారు. దర్శి అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త పై హత్యాయత్నం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి గొండు శంకర్ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తుండగా వైసిపి గూండాలు దాడి చేశారని ఆరోపించారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని పలు బూత్‌లను అధికార వైసిపి గూండాలు కబ్జా చేశారన్నారు. పోలింగ్ ఏజెంట్లను బెదిరించడంతోపాటు ఓటర్లపైనా దాడులు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ఈసీని కోరారు.