ETV Bharat / state

వైఎస్సార్​సీపీలో ఏ నేతకు సీటు గ్యారెంటీ ఉందో చెప్పగలరా: బొండా ఉమా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 10:22 PM IST

TDP Leader Bonda Uma: జనసేనాని పవన్​ కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలను టీడీపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ పొలిట్​ బ్యూరో సభ్యులు బొండా ఉమా స్పష్టం చేశారు. పవన్​ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్సార్​సీపీ నేతలు తమ సీట్లకు గ్యారెంటీ ఉందో లేదో చెప్పగలరా అని ప్రశ్నించారు.

tdp_leader_bonda_uma
tdp_leader_bonda_uma

TDP Leader Bonda Uma: తెలుగుదేశం - జనసేన పొత్తులో భాగమైన అంశాల గురించి జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ మాట్లాడితే వైఎస్సార్​సీపీకి ఎందుకని టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యులు బోండా ఉమామాహేశ్వర రావు ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల గురించి చేసిన ప్రకటనలపై, వైఎస్సార్​సీపీ నేతలు స్పందించడాన్ని బొండా తిప్పికొట్టారు.

పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కల్యాణ్​ ప్రకటించారని తేల్చి చెప్పారు. పవన్ ప్రకటించిన సీట్లపై తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం - జనసేనలు సీట్లపై దాదాపు ఓ అవగాహనకు వచ్చేశాయని స్పష్టం చేశారు. మంచి రోజు చూసి ఉమ్మడిగా ప్రకటించటమే మిగిలి ఉందని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సీట్ల కేటాయింపు పుకార్లు, సజ్జల కొడుకు భార్గవ్ నేతృత్వంలో పని చేసే ఐప్యాక్ రూపొందించిందే అని ఆరోపించారు.

'విచారణకు రండి' - టీడీపీ, వైఎస్సార్సీపీ రెబెల్​ ఎమ్మెల్యేలకు స్పీకర్​ నోటీసులు

పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కాపు నేతలు ఏ ఒక్క రోజైనా కాపు రిజర్వేషన్లు, కాపు సంక్షేమం గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. తమపై విమర్శలు చేసే నేతలు వైఎస్సార్​సీపీలో ఏ నేతకు సీటు గ్యారెంటీ ఉందో స్పష్టంగా చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. అంతర్గత కుమ్ములాటలతో ఏం చేయలేక వైఎస్సార్​సీపీ నేతలు జుట్టు పీక్కుంటున్నారని, టీడీపీ జనసేనల పొత్తు విచ్ఛిన్నమైతే చాలనుకుంటున్నారని విమర్శించారు.

టీడీపీ - జనసేన పార్టీలు వైఎస్సార్​సీపీ లాగా చీకట్లో పొత్తు పెట్టుకుని ప్రయోజనాల కోసం రాజీపడే పార్టీలు కాదని స్పష్టం చేశారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలా, జగన్ అనుచరులు కూడా టీవీల ముందు అరుస్తున్నారని మండిపడ్డారు. వెంట్రుక కూడా పీకలేరనే స్థాయి నుంచి దిగజారి, ఇక దిగిపోతున్నా అని జగన్ ప్రకటించడంతో మంత్రులకు దిక్కు తోచడం లేదని ఎద్దేవా చేశారు.

అభివృద్ధిని పట్టించుకోని జగన్​ను ఓడించాలి: షర్మిల

తెలుగుదేశంతో జనసేన పొత్తు అనగానే వైఎస్సార్​సీపీ నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని బొండా విమర్శించారు. వైఎస్సార్​సీపీ నేతలు డైపర్లు వేసుకుని తిరుగుతున్నారని వ్యంగ్యస్త్రాలు విసిరారు. తమ కూటమితో వైఎస్సార్​సీపీ ఇప్పుడు డైపర్ల పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇరు పార్టీలు కలవకూడదని గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చోవటమే వైఎస్సార్​సీపీ నేతల పనా అని పశ్నించారు.

"వైఎస్సార్​సీపీలో ఏ నేతకు సీటు గ్యారెంటీ ఉందో చెప్పగలరా"

"పవన్‌కల్యాణ్ రెండు సీట్ల ప్రకటనను తెలుగుదేశం పార్టీ స్వాగతించింది. పొత్తులో భాగమైన అంశాలను పవన్ మాట్లాడితే వైఎస్సార్​సీపీకి ఏంటి. వైసీపీలాగా చీకట్లో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలను రాజీకి పెట్టే పార్టీలు తెలుగుదేశం - జనసేన కాదు." -బొండా ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష - రెండు రోజుల్లో బదిలీలు పూర్తి చేయాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.