Chandrababu Meeting with Divyang People: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన దివ్యాంగులు, తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే దివ్యాంగులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛను ఇస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరించి చేయూత అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దివ్యాంగులు అంతా కూడా బాబు నిర్ణయం పట్ల హర్ష వ్యక్తం చేశారు. అరాచక పాలనతో రాష్ట్రానికి నష్టం కలిగించిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని దివ్యాంగులు తేల్చి చెప్పారు.
Para Lakshmaiah Joined TDP: డాక్టర్ లక్ష్మయ్య ఐఎస్ఎస్ స్టడీ సర్కిల్ నిర్వహకులు పారా లక్ష్మయ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కొత్త జడ్డవారిపాలెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ లక్ష్మయ్య, సత్తెనపల్లిలో పల్నాడు జిల్లా నేతలు, చంద్రబాబు సమక్షంలో పసుపు జెండా కప్పుకున్నారు. దిల్లీ, హైదరాబాద్, డెహ్రాడూన్, విజయవాడ, తిరుపతి, వినుకొండలలో ఐఏఎస్ స్టడీస్ సర్కిల్ నిర్వహిస్తూ లక్ష్మయ్య ఇప్పటి వరకు ఎంతో మంది యుతను ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ వంటి సర్వీసులకు ఎంపికయ్యేలా కృషి చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యమని లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.
Chandrababu Meeting TDP Leaders: రానున్న ఎన్నికల్లో ఎన్‌న్డీఏ కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం సహా జనసేన, బీజేపీ అభ్యర్ధులకు జనం నీరాజనం పడుతున్నారని, వైసీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిన తీరును ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని నేతలకు సూచించారు.
రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలంటే ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ఓటర్లకు వివరించాలని కోరారు. ఓటమి ఖాయమైన నేపథ్యంలో వైసీపీ నాయకులు ఓటర్ల జాబితా దగ్గర నుంచి పోలింగ్ వరకు అనేక అక్రమాలకు పాల‌్పడే అవకాశం ఉందని టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. ఈ 40 రోజులు గెలుపే లక్ష్యంగా ఎన్నికల కోసం సన్నద్ధమవ్వాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు, గుంటూరు జిల్లా అసెంబ్లీ, ఎంపీ అభ్యర్ధులు పాల్గొన్నారు.
కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరిమికొట్టాలి : చంద్రబాబు - YCP Leader Misbehavior of Women