ETV Bharat / state

అప్పలనాయుడు విమాన టికెట్​ ఉందా? - చంద్రబాబు పలకరించడంతో కలిశెట్టి ఎమోషనల్ - CHANDRABABU MEET TDP PARLIAMENT MPS - CHANDRABABU MEET TDP PARLIAMENT MPS

TDP Parliamentary Meeting : రాజకీయం అంటే ప్రజా సేవ అనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవద్దని తెలుగుదేశం ఎంపీలకు చంద్రబాబు సూచించారు. సేవ చేస్తేనే ప్రజలు కూడా ఆదరిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. తాను కూడా మారానని ఈ సారి అధికారుల మభ్యలో కాకుండా వాస్తవాల్లో ఉంటానని తేల్చి చెప్పారు. విజయనగరం ఎంపీగా గెలిచిన అప్పల నాయుడుని ఫ్లైట్ టికెట్​ ఉందా, తీసుకున్నావా అంటూ అప్యాయంగా అడిగారు. లేదంటే చెప్పు మన వాళ్లు టికెట్​ బుక్ చేస్తారని చంద్రబాబు ఆరా తీయడంతో కలిశెట్టి భావోద్వేగానికి గురయ్యారు.

TDP Parliamentary Meeting at Undavalli in AP
TDP Parliamentary Meeting at Undavalli in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 11:27 AM IST

TDP Parliamentary Meeting at Undavalli in AP : ఒక సామాన్యమైన కార్యకర్తకు, చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలోని ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న ఎంపీలు స్వయంగా హాజరుకాగా దిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆసక్తికర ఘటన జరిగింది.

అప్పలనాయుడు విమాన టికెట్​ ఉందా? : నాయకులుగా ఉన్న మీరు, ఇతర నాయకులతో కూడా అలాగే ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కష్టపడి, విధేయతతో ఉంటే పదవులు వస్తాయని దానికి విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని అన్నారు. అప్పలనాయుడుకు ఎంపీ టికెట్ ఇస్తే చాలా మంది చాలా వ్యాఖ్యలు చేశారని అయితే కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని పోయి కలిశెట్టి గెలిచారని అభినందించారు.

అప్పల నాయుడు ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పార్టీలో ఉన్న సామాన్యులకు టికెట్లు వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు వివరించారు. ఎంపీలందరూ నేటి రాత్రికి, లేదా రేపు ఉదయానికి దిల్లీ చేరుకోవాలని సూచించారు. అప్పల నాయుడూ ఫ్లైట్ టికెట్ ఉందా తీసుకున్నావా అంటూ అప్యాయంగా అడిగారు. లేదంటే చెప్పు మనవాళ్లు టికెట్ బుక్ చేస్తారని చంద్రబాబు ఆరా తీయడంతో కలిశెట్టి భావోద్వేగానికి గురయ్యారు.

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ప్రధాని సహా పలు పార్టీ నేతలకు ఆహ్వానం - TDLP Meeting On June 11

AP Politics : ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని ఎంపీలకు కాబోయే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైఎస్సాఆర్​సీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ అజెండాతోనే దిల్లీలో పైరవీలు చేశారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని చంద్రబాబు అన్నారు. అందుకు తగ్గట్లుగానే పార్లమెంట్​లో కృషి చేయాలన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి - చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ - cm revanth phone call to cbn

అతిగా ఎవరు వ్యవహరించ కూడదు : ముందు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించాలి, ఆ తర్వాతే మనమని టీడీపీ అధినేత తెలిపారు. వ్యవస్థలకు ఆతీతంగా ఎవరు వ్యవహరించినా, ఆ వ్యవస్థే తిరిగి కాటేస్తుందని గుర్తించాలన్నారు. పదవులు శాశ్వతం అని ఎవ్వరూ అనుకోవద్దని అన్నారు. మన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించాం, ఆయన వచ్చేందుకు సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలను గౌరవించేలా నాయకులు పనిచేయాలని సూచించారు. 5 ఏళ్ల పాటు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొని పార్టీని కార్యకర్తలే నిలబెట్టారని అన్నారు. నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎంపీలుగా మంచి పనితీరు కనబరిచి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.

బాస్​ ఈజ్​ బ్యాక్​ - కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్​ 'మిస్టర్​ నాయుడు' - cbn king maker in lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.