ETV Bharat / state

రాష్ట్రానికి సేఫ్ డ్రైవర్ నేనే- దారి తప్పిన ఏపీని మరలా గాడిలో పెడతా: చంద్రబాబు - Chandrababu Fire on CM Jagan - CHANDRABABU FIRE ON CM JAGAN

TDP Chief Chandrababu Fire on CM Jagan: బాపట్ల ప్రజాగళం సభలో జగన్‌ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ నమ్మించి గొంతు కోసే రకమని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సర్కార్ ఇంటికెళ్లడం ఖాయమన్నారు.

TDP_Chirf_Chandrababu_Fire_on_CM_Jagan
TDP_Chirf_Chandrababu_Fire_on_CM_Jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 6:52 AM IST

Updated : Apr 1, 2024, 9:05 AM IST

రాష్ట్రానికి సేఫ్ డ్రైవర్ నేనే- దారి తప్పిన ఏపీని మరలా గాడిలో పెడతా: చంద్రబాబు

TDP Chief Chandrababu Fire on CM Jagan: సీఎం జగన్‌ నమ్మించి గొంతు కోసే రకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాబాయ్‌ని చంపించిన వారికి ఎంపీ సీటు కట్టబెట్టి, బాధితులనే ఇబ్బంది పెడుతున్న సీఎం ఫేక్‌ ఫెలో అంటూ దుయ్యబట్టారు. ఐదేళ్లు కేంద్రంలో అన్ని బిల్లులకూ వైసీపీ సహకరించిందన్న చంద్రబాబు ఎన్టీయే అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయంటూ రెచ్చగొడుతోందని బాపట్ల ప్రజాగళం సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక రాష్ట్రం కోసమే తప్ప, స్వలాభం కోసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికెళ్లడం ఖాయమన్న చంద్రబాబు కూటమిది ఏకపక్ష విజయమని ధీమా వ్యక్తం చేశారు. రైతుకు కష్టం వస్తే ఆదుకోలేని ముఖ్యమంత్రి వ్యవసాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బాపట్ల ప్రజాగళం సభలో చంద్రబాబు దుయ్యబట్టారు. అన్నదాతలను ఆదుకుని పరిహారం చెల్లించటంలో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు.

జగన్‌కు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు: చంద్రబాబు - chandrababu praja galam yatra

రైతులు నష్టపోకూడదని పట్టిసీమ కడితే సీఎం జగన్‌ అక్కసుతో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాకండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూనే వారికి అందాల్సిన పథకాల్ని రద్దు చేసి నిలువునా దగా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలపై వైసీపీ పాలనలో దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్‌ నాసిరకం మద్యం తీసుకొచ్చి ఎంతో మంది ఆడబిడ్డల ఉసురుపోసుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి తానే సేఫ్‌ డ్రైవర్‌నన్న చంద్రబాబు దారి తప్పిన ఏపీని మరలా గాడిలో పెడతానన్నారు.

పిఠాపురంలో వర్మ త్యాగం గొప్పది - ఆయన్ను ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తా: పవన్ కల్యాణ్ - Pawan Pithapuram Tour Complete

Last Updated : Apr 1, 2024, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.