ETV Bharat / state

హైదరాబాద్​లో చంద్రబాబుకు ఘన స్వాగతం - భారీగా తరలివచ్చిన పసుపుదళం - Grand Welcome TO AP CM Chandrababu - GRAND WELCOME TO AP CM CHANDRABABU

TDP Arrangements Welcoming Chandrababu Naidu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బేగంపేట ఎయిర్ పోర్ట్​లో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత బాబు తొలిసారిగా భాగ్యనగరానికి చేరుకున్నారు. శనివారం విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బాబు భేటీ కానున్నారు. ఇందుకోసం దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న బాబుకు డప్పులు, లంబాడీ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

Grand Welcome TO AP CM Chandrababu
TDP Arrangements Welcoming Chandrababu Naidu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 10:16 PM IST

Updated : Jul 5, 2024, 10:47 PM IST

Grand Welcome TO AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబుకు, తెలుగుదేశం శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. దిల్లీలో రెండు రోజుల పర్యటన ముగించుకొని, బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబును తొలుత గజమాలతో సత్కరించారు. అనంతరం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు ర్యాలీ చేపట్టారు. సన్‌రూఫ్‌ కారు నుంచి చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

సాయంత్రం సుమారు 4 గంటల నుంచే ఎయిర్ పోర్ట్​కు భారీగా చేరుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులతో బేగంపేట పరిసరాలు పసుపు రంగు అద్దుకున్నాయి. రాత్రి ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రాయానికి వచ్చిన బాబుకి పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీగా ర్యాలీ చేపట్టారు. బేగంపేటలో జోరు వాన కురుస్తున్నా లెక్కచేయని కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. జూబ్లిహిల్స్‌లోని, ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌కు బాబు చేరుకోగానే భారీగా బాణాసంచా కాల్చీ స్వాగతం పలికారు. దారి పొడవునా తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో వేచి ఉండి స్వాగతం పలికారు. చంద్రబాబు రాక సందర్భంగా, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Telugu States CMs Meeting : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ శనివారం జరగనుంది. విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా, సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటలు జరిగే సమావేశానికి, పది ప్రధాన అంశాలతో ఎజెండా సిద్ధం చేశారు. తొమ్మిది, పదో షెడ్యూలులోని సంస్థల పంపిణీతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు.

ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అంశాల్లో విద్యుత్ బకాయిలు, ఏపీఎఫ్‌సీ ఉన్నాయి. అంతేకాకుండా రెండు రాష్ట్రాల మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష జరగనుంది. ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలపై సైతం రివ్యూ చేయనున్నారు. ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై, హైదరాబాద్‌లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చ జరిగే అవకాశం ఉంది. భేటీ నేపథ్యంలో ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్​కు ఇవాళ చేరుకున్నారు.

ప్రజాభవన్​లో రేపు సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ - REVANTH CBN MEETING ARRANGEMENTS

ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రిప్లై - జులై 6న భేటీకి సిద్ధం - CM Revanth Reply to AP CM Letter

Last Updated : Jul 5, 2024, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.