ETV Bharat / state

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్‌ - ఇక ఆకతాయిల వేధింపులకు చెక్ - T SAFE App For Women Safety

T-SAFE App For Women Safety : మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ సంయుక్తంగా ‘టీ (ట్రావెల్‌)- సేఫ్‌’ యాప్‌ను రూపొందించాయి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులపై ప్రయాణ సమయాల్లో ఆకతాయిల వేధింపులు అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ ద్వారా తమ సమస్యను తెలియజేస్తే చాలు వెంటనే వ్యక్తి లొకేషన్‌ ఆధారంగా దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు మెసేజ్‌ వెళ్తుంది. దీంతో పోలీసులు స్పందించి 5 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు.

T-SAFE Mobile App
T-SAFE App For Women Safety
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 12:48 PM IST

T-SAFE App For Women Safety : మహిళల కోసం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు వారి భద్రత కోసం మరో ముందడుగు వేశారు. మహిళల భద్రత కోసం ఏకంగా ఓ అప్లికేషన్​ను రూపొందించారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ సంయుక్తంగా ‘టీ (ట్రావెల్‌)- సేఫ్‌’ యాప్‌ను రూపొందించాయి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులపై ప్రయాణ సమయాల్లో ఆకతాయిల వేధింపులు అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది.

తెలియని ప్రాంతాలకు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఈ యాప్‌ తోడుగా ఉంటుంది గమ్యస్థానానికి వెళ్లే ముందు వివరాలను నమోదు చేసి మానిటరింగ్‌ రిక్వెస్ట్‌ పెట్టుకోవాలి. గమ్యస్థానం చేరేంత వరకు పోలీసులు వారి ప్రయాణంపై నిఘా పెడతారు. యాప్‌ ద్వారా తమ సమస్యను తెలియజేస్తే చాలు వెంటనే వ్యక్తి లొకేషన్‌ ఆధారంగా దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు మెసేజ్‌ వెళ్తుంది. దీంతో పోలీసులు స్పందించి 5 నిమిషాలలో సంఘటన స్థలానికి చేరుకుంటారు.

తెలంగాణ ఆడపడుచులను ఆటపట్టించడం అంత ఈజీ కాదు!

మహిళలకు తోడుగా ట్రావెలింగ్‌ సేఫ్టీ యాప్‌ : ఇది దేశంలోనే మొదటి ట్రావెలింగ్‌ సేఫ్టీ యాప్‌ అని పోలీసులు చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ లేకపోయినా టీ-సేఫ్‌ సేవలు పొందవచ్చు. ప్రయాణానికి ముందు 100కు డయల్‌ చేసి ఐవీఆర్‌ ద్వారా ‘8’ నంబర్‌ను క్లిక్‌ చేసి వివరాలను తెలియజేస్తే సెల్‌ టవర్‌ ఆధారంగా వారి జాడను గుర్తిస్తారు. దీంతో ఏదైనా సమస్య ఎదురైతే తక్షణమే స్పందించే అవకాశం కలుగుతుంది. వెబ్‌ అప్లికేషన్‌ ద్వారానూ మానిటరింగ్‌ రిక్వెస్ట్‌ పెట్టొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి వెబ్‌ ట్రాకింగ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

చేరుకోవాల్సిన ప్రాంతం, పేరు, ఫోన్‌ నంబరు, మోడ్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, వాహనం నంబరు పొందుపరచాలి. ఈ రెండు పద్ధతుల కంటే ‘ట్రావెల్‌ సేఫ్‌ - తెలంగాణ పోలీస్‌’ యాప్‌ వల్ల సత్వర సాయం లభిస్తుందని పోలీసులు చెబుతున్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నమోదు చేసిన తరువాత చరవాణికి వచ్చిన ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి. అనంతరం యాప్‌లోని స్టార్ట్‌ మానిటరింగ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి గమ్యస్థానం, మోడ్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, వాహనం నంబరును పొందుపరిస్తే సరిపోతుంది.

ప్రతి 15 నిమిషాలకు అలర్ట్‌ : మానిటిరింగ్‌ రిక్వెస్ట్‌ పెట్టుకున్న తరువాత ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఫోన్‌కు ఆటోమెటిక్‌ సేఫ్టీ మెసేజ్‌ వస్తుంది. వాటికి నాలుగు అంకెల పాస్‌కోడ్‌ పంపించాలి. దాని ఆధారంగా మనం సురక్షితంగా ఉన్నామని పోలీసులు గుర్తిస్తారు. మెసేజ్‌లకు సమాధానం ఇవ్వకపోయినట్లయితే అప్రమత్తమవుతారు. ప్రయాణ మార్గం మారినా, రాష్ట్ర సరిహద్దు దాటి వెళ్లినా, మార్గ మధ్యలో ఎక్కువసేపు ఆగినా టీ-సేఫ్‌ కంట్రోల్‌ రూం నుంచి నేరుగా 100కు డయల్‌ చేస్తారు. అక్కడి నుంచి సంబంధిత వ్యక్తికి ఫోన్‌ వెళ్తుంది. ఆయన స్పందించి సురక్షితమని చెబితే సరిపోతుంది. లేకుంటే స్థానిక పోలీసులు నిమిషాల వ్యవధిలో లొకేషన్‌ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటారు.

మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్‌ - ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

అమ్మాయిలు, మీ ఫోన్​లో ఈ యాప్స్​ ఉన్నాయా? లేదంటే బయటికి వెళ్లినప్పుడు ఇబ్బందులే​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.