Swarnandhra 2047 Vision Document Gudelines in AP : స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికల్ని జిల్లా, మండలాల వారీగా రూపకల్పనక ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వికసిత్ భారత్ 2047లో భాగంగా జిల్లా, మండలాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి కూడా విజన్ ప్రణాళికలపై అభిప్రాయాలు సేకరించాలని సూచించింది. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యాచరణ ప్రణాళికను ఇంటింటికీ చేరవేయాలని ఆదేశించింది.
నీతి ఆయోగ్ భేటీ - 'వికసిత్ ఏపీ 2047' అంశాలు ప్రస్తావించిన చంద్రబాబు - chandrababu in Niti Aayog
అక్టోబరు 15 నాటికి సిద్ధం కావాలి : సెప్టెంబరు 26 వరకూ 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో నిర్వహించే సభలు సమావేశాల్లో వివరాలు సేకరించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. దీనిపై సెప్టెంబరు 27 నుంచి 29 వరకూ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని స్పష్టం చేసింది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 5 వరకు జిల్లా కలెక్టర్లు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశం కావాలని ఆదేశించింది. రైతులు, ప్రముఖ వ్యక్తులు, వాణిజ్య సంఘాలు, ఇతర అసోసియేషన్లతోనూ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 30 నాటికి మండల స్థాయిలో, అక్టోబరు 15 నాటికి జిల్లా స్థాయి 2047 స్వర్ణాంధ్ర ప్రణాళికలు సిద్ధం కావాలని ఆదేశించింది.
నీతి ఆయోగ్ సమావేశం కోసం దిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు - CM Chandrababu Delhi Tour