Sunita Campaign for YS Sharmila in Pulivendula : వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో వివేకా కుమార్తె సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షో నిర్వహించి షర్మిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తన తల్లి లింగాల మండలంలో పుట్టిందన్న సునీత తమ ఇంటి ఆడపడుచుకు అన్యాయం జరిగిందని అక్కడి ప్రజలకు వివరించారు. వివేకాను చంపిన, చంపించిన హంతకులను ఓడించి షర్మిలను గెలిపిస్తేనే తనకు న్యాయం జరుగుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వైయస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో వివేకా కుమార్తె సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ షర్మిల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. లింగాల వెలిగండ్ల పార్నేపల్లె గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు. మా అమ్మ లింగాల మండలంలో పుట్టిందని తాను కూడా ఇక్కడే పుట్టారని మా అమ్మ సౌభాగ్యమ్మకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. మీ ఇంటి ఆడపడుచుకు అన్యాయం జరిగిందని మీరందరూ ఓటు ద్వారా మేలుకోవాలని సునీత పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా నాన్న హత్య విషయంలో న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నానని ఇప్పుడు ఎన్నికల ద్వారా న్యాయం గెలిపించు కోవడానికి అవకాశం వచ్చిందని సునీత తెలియజేశారు. ఈ రోడ్ షోలో వైఎస్ సునీత, నర్రెడ్డి తులసి రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువకుమార్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.
కొంగుచాచిన తోబుట్టువులకు ఏం చెప్తావ్ జగన్? - Sisters fire on CM Jagan
వివేకాను చంపిన, చంపించిన హంతకులను ఓడించాలి. షర్మిలను గెలిపిస్తేనే న్యాయం జరుగుతుంది. వైఎస్ వివేకా హత్య విషయంలో న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్కు, ప్రతి అధికారి వద్దకు కాళ్లరిగేలా తిరిగాను. ఇప్పుడు ఎన్నికల ద్వారా న్యాయం గెలిపించుకునే అవకాశం వచ్చింది. మీ ఆడపడుచుకు అన్యాయం జరిగిందని భావిస్తే ఓటు ద్వారా న్యాయం చేయండి. -సునీత, వైఎస్ వివేకా కుమార్తె
అనంతరం తులసి రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ దీనికి అదనంగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు. మహిళలకు నెలకు రూ. 8333 అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు గ్యాస్ సిలిండర్ రూ. 500 కి ఇస్తామని అన్నారు. వృద్ధులు వికలాంగుల పింఛన్లు ఎంత మంది అర్హులు ఉంటే అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రచారంలో దూసుకుపోతున్న షర్మిల - మద్దతు కూడగడుతున్న సునీత - Sunita Reddy meets YCP leaders