Summer Heat Waves of Several Districts in AP: భానుడి ఉగ్రరూపానికి ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా కొప్పునూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 45.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 45.5 డిగ్రీలు, కడప జిల్లా సింహాద్రిపురంలో 44.9 డిగ్రీలు, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో భానుడి భగభగలు- ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ తెలిపింది. 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయని తెలిపింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని 234 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అల్లూరి, మన్యం జిల్లాల్లో తీవ్రస్థాయిలో వడగాలులు వీచే అవకాశమున్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు - ఈ మండలాల్లో వడగాలులు - AP TEMPERATURE
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్‌లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచాయి.
బుధవారం 34 మండలాల్లో తీవ్ర వడగాలులు, 216 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఏపీతోపాటు తెలంగాణలో కూడా ఎండ తీవ్రత మరింత పెరిగింది. పలు జిల్లాలో అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. సాయంత్రమైనా కూడా వేడి తీవ్రత తగ్గటమేలేదు. కొన్ని ప్రాంతాల్లో కరెంటు సరిగా లేక ఉక్కపోతకు గురవుతున్నారు. మరో రెండు రోజులపాటు ఇదే వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.