ETV Bharat / state

చుట్టూ చీకటైనా విద్యార్థులకు వెలుగు దారి చూపారు - పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలిచారు - Blind Teachers Inspire Students - BLIND TEACHERS INSPIRE STUDENTS

Blind Teachers Inspire Students : విధికి సలామని తామెప్పుడూ తలవంచలేదు. కళ్లు లేవని కలత చెందలేదు. తాము చూడలేని లోకాన్ని తమవైపే చూసేలా నిటారుగా నిలబడ్డారు. అంధులం కాదు, అందరివాళ్లం కావాలని ముందుకు సాగారు. అలా అహర్నిశలు కృషి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. చూపులేకున్నా విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Physically Challenged Success Stories
Blind Teachers Teaching Children (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 1:49 PM IST

Updated : Aug 27, 2024, 2:11 PM IST

Blind Teachers Success Stories in Telangana : ప్రపంచంలో మనిషికి అన్నింటికంటే అతి ముఖ్యమైనవి కళ్లే. అవే లేకుంటే ఆస్తి, అంతస్తులు ఎన్ని ఉన్నా వ్యర్థమే అనే భావన అందరిలోనూ ఉంటుంది. ఆ ఆలోచనను పటాపంచలు చేసి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కామారెడ్డి జిల్లా బారండ్‌ఎడ్గికు చెందిన ఉపాధ్యాయుడు సంతోశ్​, సూర్యాపేట జిల్లా బండరామారం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బాణాల ఉమారాణి. పుట్టుకతోనే రెండు కళ్లు లేకపోయినా అంధత్వాన్ని జీవితానికి భారంగా ఏనాడు భావించలేదు.

ధైర్యంగా విధిరాతను ఎదుర్కొని చివరికి ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం అహర్నిశలు కృషి చేసిన సంతోశ్​ 2017లో డీఎస్సీ పరీక్ష రాసి 2020లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. మొదటగా లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసి, ఆ తర్వాత బీర్కూర్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లాడు.

అందరికీ ఆదర్శంగా అంధ ఉపాధ్యాయుల బోధన : ఇటీవల చేసిన బదిలీల్లో మళ్లీ లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకే వచ్చి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా ఎంపికైన మొదట్లో చదువు ఎలా చెబుతారని అందరూ అనుమానపడ్డారు. కొన్ని రోజులకు బోధించే విధానాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు. బోధించే పాఠాన్ని ముందు రోజే యూట్యూబ్‌లో విని, పాఠశాలకు వచ్చాక విద్యార్థులతో చదివిస్తున్నారు. ఆ తర్వాత పూర్తిగా దానికి సంబంధించిన సారాంశాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు.

"ఒక అంధ ఉపాధ్యాయుడుగా ఎస్జీటీగా ఇక్కడ ఎంపికయ్యాను. పిల్లలకు విద్యను ఎలా బోధిస్తానంటే, చెప్పాలనుకునే పాఠాన్ని ముందురోజు నా స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్​కు వివరిస్తాను. దానికి సంబంధించి విషయాన్ని యూట్యూబ్​లో సెర్చ్​ చేసుకుంటాను. పాఠశాలకు వచ్చాక విద్యార్థులతో ఆ నోట్స్​ను చదివిస్తాను." -సంతోశ్​, అంధ ఉపాధ్యాయుడు

Blind Teachers Teaching Children : రోజు బీర్కూరు నుంచి లింగంపల్లి వరకు తన తండ్రి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి, సాయంత్రం మళ్లీ తీసుకెళ్తున్నాడు. అలా ఏ రోజు పాఠశాలకు గైర్హాజరు కాకుండా విధులు నిర్వహిస్తూ గ్రామస్థుల మన్ననలు పొందుతున్నాడు. కళ్లు లేకపోయినా తమకు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నాడని విద్యార్థులు అంటున్నారు.

YUVA : వైకల్యాన్ని జయించి - ఐఐఎం ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన యువతి - student excelled in IIM entrance

25ఏళ్ల క్రితం చెత్తకుప్పలో దొరికిన అంధురాలు- ఇప్పుడు అందరికీ ఆదర్శం- టార్గెట్ IAS - Blind Girl Success Story

Last Updated : Aug 27, 2024, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.