ETV Bharat / state

గ్రూప్స్‌ పరీక్షల్లో మార్పులు చేయాలంటూ రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు - అరెస్ట్ చేసిన పోలీసులు - Students Strike in Telangana - STUDENTS STRIKE IN TELANGANA

Student Unions Strike in Telangana : ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం తన మొండివైఖరి వీడాలంటూ పలు విద్యార్థి సంఘాల నేతలు రోడెక్కి ఆందోళన చేపట్టారు. గ్రూప్స్‌ పరీక్షల్లో మార్పులు చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ చేపట్టాలంటూ డిమాండ్‌ చేశారు.

Student Strike in Telangana Against Government
Student Strike in Telangana Against Government (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 1:35 PM IST

Student Strike in Telangana Against Government : గ్రూప్-2, 3 ఉద్యోగాల భర్తీలో పోస్టులను పెంచాలని గ్రూప్-1 మెయిన్స్ 1:100 నిష్పత్తి అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలన్న తదితర డిమాండ్లపై నిరుద్యోగ సంఘాలు నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చాయి. పలు నిరుద్యోగ సంఘాలు ఇచ్చిన మార్చ్‌ను దృష్టిలో పెట్టుకొని నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

గ్రూప్ - 2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ వద్ద బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం బీఆర్ఎస్వీ ఆందోళన నిర్వహించింది. డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని, అక్టోబర్‌లో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ టీజీపీఎస్సీ ముట్టడించింది. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం ఆపమని బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు శ్రీనివాస్‌ అన్నారు.

ఓయూలో 'నిరుద్యోగ మార్చ్'.. విద్యార్థి నాయకులు, కాంగ్రెస్​ నేతల అరెస్ట్

"రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇవాళ మాట మార్చింది. 1:100 విధంగా ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గ్రూప్-2 పోస్టులు పెంచాలని ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ టీజీపీఎస్సీని ముట్టడించాం. భవిష్యత్తులో ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం." - విద్యార్థి సంఘాల నాయకులు

రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్​ను వెంటనే అమలు చేసి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం​ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ, గ్రూప్-1, 2 పోస్టులు పెంచాలని కోరుతూ నిరుద్యోగ సంఘాలు టీజీపీఎస్సీ ముట్టడి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. చిక్కడపల్లి, అశోక్​నగర్ ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు.

నిజాం హాస్టల్​లో కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థుల ఆందోళన

సంగారెడ్డి జిల్లాలో కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.