ETV Bharat / state

సమస్యలకు నిలయంగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ కాలేజీలు - అరకొర వసతులతో విద్యార్థుల చదువులు - Problems In Mahabubnagar Colleges - PROBLEMS IN MAHABUBNAGAR COLLEGES

Lack Of Facilities in Mahabubnagar Colleges : శిథిలావస్థకు చేరిన భవనాలు, చాలీచాలనీ మౌలిక వసతులు, ప్రయోగాలు లేని ప్రయోగశాలలు. ఇలా అనేక సమస్యలతో, అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు. ఇటీవలి బదిలీలతో చాలాచోట్ల అధ్యాపకుల పోస్టులు ఖాళీ అయ్యాయి. అతిథి అధ్యాపకుల గడువు ముగియడంతో ఆగస్టు నుంచి వాళ్లూ రావడం లేదు. ప్రధాన వసతులు సరే, కనీసం కళాశాల నిర్వహణ నిధులైనా సరిపడా ఇస్తున్నారా అంటే అదీలేదు. మొత్తంగా ప్రభుత్వ కాలేజీల్లో సమస్యల నడుమ విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు.

Students Facing Problems With Lack Of Facilities
Students Facing Problems With Lack Of Facilities (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 8:42 AM IST

Students Facing Problems With Lack Of Facilities : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వసతులు కరవై, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓచోట శిథిలావస్థకు చేరిన భవనాలుంటే, మరోచోట అసంపూర్తిగా ఉన్నాయి. ఒకచోట ప్రయోగశాలలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే, మరోచోట ప్రయోగ శాలలు ఉన్నా సామగ్రి లేక నిరుపయోగంగా ఉన్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో ఫర్నీచర్ లేక అరకొర వసతుల నడుమ విద్యార్థులు చదువు నెట్టుకొస్తున్నారు.

ల్యాబ్స్ ఉన్నా పనికిరావు : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 72 మండలాల్లో 56 ప్రభుత్వ జూనియర్‌, ఒకేషనల్ కళాశాలల్లో 19 వేల మంది చదువుకుంటున్నారు. వారంతా చాలీచాలని సౌకర్యాలతో విద్యను కొనసాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 10 కోర్సులకు గానూ 1100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకేషనల్ కోర్సులు కాబట్టి కచ్చితంగా ప్రయోగశాలలు అవసరం. కానీ ఒక్కటీ లేవు. విద్యార్థులకు సరిపడా కొత్త భవన నిర్మాణం జరిగినా, అసంపూర్తిగా వదిలేశారు. 2019లోనే భవనం పూర్తయినా ప్రారంభించే దిక్కులేదు. అందులోనే విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు.

ఒకే షెడ్డులో నాలుగు తరగతులకు పాఠాలు - ఇట్లయితే మేం చదుకునేదెలా? - NAKREKAL GOVT SCHOOL PROBLEMS

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది. అక్కడున్న ప్రయోగశాలను కూల్చేసి ఒకేషనల్ జూనియర్ కాలేజీ కొత్త భవనం నిర్మించడంతో విద్యార్థులకు ప్రయోగశాలలు లేకుండాపోయాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఒక్కో మీడియంలో 4 గ్రూపుల చొప్పున కోర్సులు నడుస్తున్నాయి. 1200 మందికి పైగా విద్యార్థులుంటారు. వారికి సరైన వసతులు లేవు. ఉన్న మూత్రశాలల్నే బాలుర జూనియర్ కాలేజీ, ఒకేషనల్ కళాశాల విద్యార్థులు వినియోగించుకోవాల్సిన దుస్థితి.

"సరిపడా తరగతి గదులు లేవు. బెంచీలు లేక కింద కూర్చొని చదువుకుంటున్నాం. ల్యాబ్స్‌ లేవు. కొత్త భవనం కట్టి మధ్యలో ఆపేశారు. ప్రాక్టికల్స్ అన్నీ బయట చేస్తున్నాం. వర్షం వచ్చిందంటే ఆరోజు ల్యాబ్ ఉండదు." - విద్యార్థులు

నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కొరవడ్డాయి. అక్కడి విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేవు. సరిపడా గదులు, ఫర్నీచర్ లేదు. 1995లో నిర్మించిన ఆ కళాశాల అప్పుడే శిథిలావస్థకు చేరుకుంది. కళాశాల చుట్టూ చెత్తా చెదారంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.

నిధుల కొరత : విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇవి మచ్చుకు కొన్నే. 56 జూనియర్ కళాశాలల్లో ఒక్కో చోట ఒక్కో సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మౌలిక వసతుల కల్పన, భవన నిర్మాణాలంటే పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. కానీ కళాశాల నిర్వాహణ నిధులు చాలినంత ఇవ్వట్లేదు. ఏ సామగ్రి కొనాలన్నా ప్రిన్సిపల్స్‌ తమ జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఇలా అయితే మా చదువు సాగేదెలా? - 162 మంది విద్యార్థులకు రెండే తరగతి గదులు - School Students Facing Problems

గతంలో విద్యార్థుల ప్రవేశాల సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నామమాత్రపు రుసుములు వసూలు చేసేవారు. ఆ డబ్బు కళాశాల నిర్వహణ కోసం ఉపయోగపడేది. 2014 నుంచి ఫీజు వసూలు నిలిపివేశారు. అప్పటి నుంచి ప్రభుత్వమే నేరుగా నిర్వహణ నిధులు అందిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవని ప్రిన్సిపల్స్‌ కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

"ఇక్కడ దాదాపుగా 9 కోర్సులు రన్ అవుతున్నాయి. 25 తరగతులు ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు 10 తరగతులు మాత్రమే ఉన్నాయి. ల్యాబ్స్‌ కూడా లేవు. 22 మంది లెక్చరర్స్ ఉండాలి కానీ 15 మందిమే ఉన్నాం. సరిపడా అధ్యాపకులు ఉంటేనే విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ల్యాబ్స్ కూల్చి ఒకేషనల్ కోర్సు కోసం ఇచ్చారు. ఇప్పటివరకు ల్యాబ్స్ నిర్మించడానికి నిధులు కేటాయించలేదు." పి.గోపాల్, ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌

సమస్యల్ని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించామని, నిధులు రాగానే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇటీవల జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల బదిలీలు పూర్తయ్యాయి. దీని వల్ల పలు కళాశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. గతంలో ఉన్న అతిథి అధ్యాపకులు జులై నాటికి ఒప్పందం ముగియడంతో ఆగస్టు నుంచి రావడం లేదు. అధ్యాపకుల కొరతతో పాటు సమస్యలు తీర్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

పరదాల కిందే పాఠాలు - ఎండ, వానలకు ఇబ్బందులు పడుతూ పిల్లల చదువులు - Lack Of Facilities In Govt School

పాఠాలు వింటుంటే ప్రాణం పోతుందేమో - బడికి వెళ్లాలంటే భయమేస్తోంది - MALCHELMA GOVT SCHOOL PROBLEMS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.