ETV Bharat / state

తెలుగు విద్యార్థిని సత్తా - రూ. 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం - Job with Annual Salary of 40 Lakhs - JOB WITH ANNUAL SALARY OF 40 LAKHS

Student Nirmala Priya got Job With an Annual Salary of 40 Lakhs: ప్యారిస్​లోని గ్రూప్ ఏడీపీలో తెలుగు విద్యార్థిని ఏకంగా 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపిక అయ్యింది. రాజాంలో జీఎంఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్​లో ఐటీ పూర్తి చేసిన ఈ విద్యార్థిని 9.51 సీజీపీఏ సాధించారు.

Student Nirmala Priya got Job With an Annual Salary of 40 Lakhs :
Student Nirmala Priya got Job With an Annual Salary of 40 Lakhs : (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 10:03 AM IST

Student Nirmala Priya got Job With an Annual Salary of 40 Lakhs : పట్టుదలతో చదివి లక్ష్యసాధనకు కృషి చేస్తే సాధించ లేనిది ఏదీ లేదని నిరూపించింది ఈ విద్యార్థిని. ఆర్థిక మాంధ్యంతో ఉద్యోగం సంపాదించడమే గగనం అయిపోతున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలో కొలువు సాధించింది. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుల్ల గ్రామానికి చెందిన విద్యార్థిని నిర్మల ప్రియ ఈ సంవత్సరం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రాజాంలో జీఎంఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల (GMRIT Engineering College)లో బీటెక్​లో ఐటీ పూర్తి చేసింది.

9.51 సీజీపీఏ సాధించారు. ఎనిమిదో సెమిస్టర్​లో భాగంగా ఈమెతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు ప్యారిస్​లోని గ్రూప్ ఏడీపీలో ఇంటర్న్​షిప్ చేయడానికి ఎంపికయ్యారు. ఒక్కొ విద్యార్థి 1000 యూరోల (90,000 రూపాయలు) స్టైఫండ్​తో ఇంటర్న్​షిప్ పూర్తి చేశారు. ప్యారిస్​లోని గ్రూప్ ఏడీపీలో ఇంటర్న్​షిప్​లో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని నిర్మల ప్రియ కొలువు సాధించింది.

Student Nirmala Priya got Job With an Annual Salary of 40 Lakhs :
Student Nirmala Priya got Job With an Annual Salary of 40 Lakhs : (ETV Bharat)

పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA

40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం : నిర్మల ప్రియకు ఏకంగా 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ డా. సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్‌ గురువారం తెలిపారు. విద్యార్థిని నిర్మల ప్రియ బీటెక్ కోర్స్​లో భాగంగా ఉన్న కెరీర్ సౌత్ కోర్సుల్లో ఒకటైన సైబర్ సెక్యూరిటీని పూర్తి చేయడం ద్వారా ఈ ఉద్యోగం వరించిందని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆయనతో పాటు జీఎంఆర్‌వీఎఫ్‌ విద్యా విభాగం సంచాలకుడు డా. జె. గిరీష్‌ విద్యార్థినిని అభినందించారు. విద్యార్థిని నిర్మల ప్రియ తండ్రి వెంకటరావు కేటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్​డీ - కర్ణాటక గవర్నర్​ నుంచి పట్టా అందుకున్న యువకుడు

సైబర్‌ సెక్యూరిటీపై పట్టు : ప్యారిస్​లోని గ్రూప్ ఏడీపీలో కొలువు సాధించిన సందర్భంగా విద్యార్థిని నిర్మల ప్రియ బీటెక్‌ కోర్సుల్లో భాగంగా ఉన్న కెరీర్‌ పాత్‌ కోర్సుల్లో ఒకటైన సైబర్‌ సెక్యూరిటీని పూర్తి చేయడం ద్వారా ఈ ఉద్యోగం వరించిందని అన్నారు. ప్రపంచ అవసరాలకు తగిన రీతిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మంచి వార్షిక వేతనంతో ఎంపికవడం సంతోషాన్ని ఇస్తోందని విద్యార్థిని అన్నారు.

వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన - యువతకు ఆదర్శం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.