ETV Bharat / state

విద్యార్థులకు పది రోజుల్లోపే అమెరికా వీసా - ఎలాగో తెలుసా?

పది రోజుల్లోనే యూఎస్‌ వీసా ఇంటర్వ్యూ - ఈటీవీ భారత్‌ ముఖాముఖిలో అమెరికా కాన్సులేట్‌ కాన్సులర్‌ చీఫ్‌ రెబెకా డ్రామె

Quick US Visa Appointments For Indian Students
Quick US Visa Appointments For Indian Students (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Quick US Visa Appointments For Indian Students : స్టూడెంట్‌ వీసాల ఇంటర్య్వూల కోసం వేచి ఉంటే సమయం పది రోజులకు మించకూడదన్నదే తమ లక్ష్యమని హైదరాబాద్‌లోని అమెరిగా కాన్సులేట్‌లో కాన్సులర్‌ ఛీఫ్‌ రెబెకా డ్రామె పేర్కొన్నారు. విద్యార్థులకు వీసాలపై ఎలాంటి పరిమితీ లేదని, ఎంతమంది వచ్చినా అమెరికాకు స్వాగతిస్తామని ఆమె తెలిపారు. కాన్సులేట్‌ బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారిక పర్యటన చేస్తున్న ఆమె ఈటీవీ భారత్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అలాంటి వార్తలు విన్నప్పుడు బాధేస్తుంది : చదువు కోసం మొదటిసారి అమెరికా వస్తున్న విద్యార్థులు వీసాలు క్లియర్‌ చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రెబెకా డ్రామె తెలిపారు. వారికి వెయిటింగ్ సమయం పది రోజులకు మించకూడదన్నది వారి లక్ష్యమని చెప్పారు. అమెరికా వచ్చ్ విద్యార్థుల భద్రతకు వారి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని వివరించారు. తాను ఒక తల్లినేనని విద్యార్థులు ప్రమాదాల్లోనూ, ఇతరత్రా కారణాలతోనూ చనిపోయిన విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చలి నుంచి రక్షణనిచ్చే దుస్తులు ధరించక ఒక విద్యార్థి చనిపోయాడని తెలిసి చాలా బాధనిపించిందని తెలిపారు. అమెరికా వచ్చే విద్యార్థులు, ముఖ్యంగా షికాగో వంటి అత్యంత చలి ప్రాంతాల్లో ఉండాలనుకున్నవారు ఎలాంటి దుస్తులు ధరించాలి, అసాంఘిక శక్తులు ఉంటే ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.

విద్యార్థి వీసాలు ఇచ్చేది అమెరికాలో చదువుకోడానికే. అలా చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగంలో అనుభవం సంపాధించి, చదువు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగి వెళ్లి మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్న లక్ష్యంతో ఓపీటీ పెట్టినట్లు ఆమె వివరించారు. 2023-2024లో ఓపీటీపై ఉన్న విద్యార్థులు 97,556 మంది ఉన్నారని, గతేడాది కంటే ఇది 41శాతం తక్కువని వివరించారు.

అమెరికాలో చదుకోవాలనుకుంటున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే పక్కా విసా కన్ఫామ్​ - Study In America

రోజుకు 1,800 పైగా ఇంటర్వ్యూలు చేస్తున్నాం : బీ1/బీ2 వీసాల ఇంటర్వ్యూల కోసం నిరీక్షణ సమయం 2021-22 నాటికి నాలుగు సంవత్సరాలు ఉండేదని వారి కాన్సులేట్‌ బృందాల ప్రత్యేక కృష్టితో దాన్ని సంవత్సరానికి తగ్గించినట్లు తెలిపారు. మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బీ1, బీ2 మినహా స్టూడెంట్స్, వర్కర్స్‌ వంటి వీసా అప్లికేషన్లను రెండు నెలల్లోపే క్లియర్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు సంవత్సరాల నుంచి పోలిస్తే హైదరాబాద్‌ కాన్సులేట్‌లో సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేశామని, వచ్చే ఏడాది చివరినాటికి మూడింతలు చేస్తామని వెల్లడించారు. కొవిడ్‌ తర్వాత కాలంలో రోజుకు 500 నుంచి 600 వీసా ఇంటర్వ్యూలు జరిగితే, ఇప్పుడు రోజుకు 1,800 దాటి చేస్తున్నట్లు వివరించారు. గతేడాది దేశంలోని అన్ని అమెరికన్‌ కాన్సులేట్లు 1.4 లక్షల వీసా ఇంటర్వ్యూలు చేశాయని తెలిపారు.

సిబ్బందికి ముందే అవగాహన కల్పిస్తున్నాం : హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ ఆగ్నేయాసియాలోనే అతి పెద్దదన్న రెబెకా డ్రామె బీ1, బీ2 వీసాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో వెయిటింగ్‌ సమయం ఎక్కువగా ఉంటుందని కారణాలు వివరించారు. వీలైనంతవరకు భారత్‌లోనే వీసా స్లాట్‌ల కోసం ప్రయత్నించాలని సూచించారు. అప్పటికీ ఎవరైనా ఇతర దేశాల్లో ఇంటర్వ్యూలకు హాజరవుతుంటే వారిని ఎలాంటి ప్రశ్నలు అడగాలన్న విషయంలో అక్కడి సిబ్బందికి ముందే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లో ఇంగ్లిషు, తెలుగు క్షుణ్నంగా తెలిసిన అనువాదకుల్ని నియమిస్తున్నారని ఇంటర్వ్యూలో తెలుగులో మాట్లాడాలనుకునేవారు ట్రాన్స్‌టేరర్స్‌ కావాలని కోరితే సరిపోతుందని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక హెచ్‌1బీ వీసాల విధానం ఎలా ఉంటుందన్న అంశంపై తానేమీ మాట్లాడి అనుకోవడం లేదని తెలిపారు. సహజంగ అధ్యక్షుడు మారాక విధానాల్లో కొన్ని మార్పులు ఉంటాయని వాటిని ఇప్పుడే ఊహించలేమని చెప్పారు.

వీసా, మాస్టర్ కార్డు, రూపే- ఇకపై క్రెడిట్ కార్డ్ సెలక్షన్ మీదే గురూ! - Credit Card Selection

ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకుంటున్నారా - ఈ నిబంధనలు పాటిస్తే వీసా ఈజీ! - SIG CEO Preethi Kona Interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.