ETV Bharat / state

మీ 'జీవ గడియారం' సరిగ్గా పని చేస్తుందా? - చేతి గడియారానికి అనుసంధానిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

జీవ గడియారం గురించి తెలుసా - ప్రకృతి అనుసరించే ఈ క్లాక్ ఏంటీ - దాంతో ఏంటి ప్రయోజనాలు

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Story on Biological Clock in Human Body
Story on Biological Clock in Human Body (Etv Bharat)

Story on Biological Clock in Human Body : టిక్‌ టిక్‌ టిక్‌లు వినిపించవు. పెద్ద ముల్లూ, చిన్న ముల్లూ కనిపించవు. అయినా సరే, మన శరీరంలో ఓ గడియారం నిత్యం పనిచేస్తూనే ఉంటుంది. అదే మన ఆకలి నిద్రల్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్య అనారోగ్యాల్ని నిర్దేశిస్తుంది. ఆ ‘జీవ గడియారం’తో మన చేతి గడియారాన్ని అనుసంధానించుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.

మనిషి ప్రకృతిలో పుట్టాడు. ప్రకృతి భిక్షతోనే పెరిగాడు. ఎంత శక్తిమంతుడైనా, ఎన్ని ఆవిష్కరణలు చేసినా ప్రకృతి నియమాల ప్రకారం తూచాతప్పకుండా పాటించాల్సిందే. తేడావస్తే ప్రకృతి తాట తీస్తుంది. తన షరతులను ఉల్లంఘించకుండా మనిషి లోలోపల ఓ జీవ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఆ ముళ్లు ఒక్కో సమయానికి శరీర వ్యవస్థలోని ఒక్కో విభాగం మీదుగా ప్రయాణిస్తాయి. ఫలితంగా, కొన్ని వేళల్లో కొన్ని భాగాలు చురుగ్గా మారిపోతాయి. కొన్ని గ్రంథుల ఊట పెరిగిపోతుంది. కొన్ని రసాయనాల ప్రవాహం ఉద్ధృతం అవుతుంది.

బాహుబలి గడియారం : మెదడులోని సుప్రాచియాస్మాటిక్‌ న్యూక్లియస్‌ (ఎస్‌సీఎన్‌) అనే కణ సముదాయాన్ని ‘బాహుబలి గడియారం’గా చెబుతారు. ఇది ప్రకృతికీ, శరీరానికీ మధ్య రాయబారిగా పనిచేస్తుంది. సూర్యోదయ, సూర్యాస్తమయాల సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది. ఆయా వేళల్ని అనుసరించి శరీర ఉష్ణోగ్రత ఎంత ఉండాలన్నది నిర్ణయిస్తుంది. హార్మోన్ల స్రావాన్ని నిర్దేశిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడి నుంచే సకల వ్యవస్థలకూ సందేశాలు వెళ్తాయి. అదనంగా స్కిన్‌ లివర్‌, ఇమ్యూన్‌, కిడ్నీ, లంగ్స్ ఇలా అనేకానేక ఉప గడియారాలూ పనిచేస్తుంటాయి. పునరుత్పత్తి వ్యవస్థకు కూడా ఓ గడియారం ఉంది. మహిళల్లో ప్రత్యేకించి కొన్ని రోజుల్లో మాత్రమే గర్భధారణ సామర్థ్యం అధికంగా ఉండటమే దీనికి ఉదాహరణ.

దాన్ని బట్టే చికిత్సలు : మన శరీరంలోని దాదాపు యాభైశాతం జన్యువులు జీవ గడియారం నియంత్రణలో పని చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉదయం పూట మన జీవక్రియలు చురుగ్గా సాగుతుంటాయి. ఆ కారణంగానే థైరాయిడ్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులతో ముడిపడిన ఔషధాల్ని పొద్దున్నే తీసుకోవాలని చెబుతారు. ఏ సమయంలో ఏ ఔషధాలు రోగిపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే కోణంలోనూ అంతర్జాతీయంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా క్యాన్సర్‌ రోగులకు వారి జీవ గడియారాల్ని బట్టి కీమోథెరపీ వేళల్ని నిర్ణయిస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి.

ఉదయం సాయంత్రాలను గుర్తించి : జీవ గడియారానికి సూర్యకాంతే శక్తి కేంద్రం. చెట్టు మీది ఆకులు పత్రహరితాన్ని తయారు చేసుకోవడంలో సూర్యకిరణాలను ఉపయోగించుకుంటాయని చిన్నప్పుడే చదువుకున్నాం. మనిషి మనుగడకూ కాంతి చాలా అవసరమే. ప్రకృతిలోని చీకటివెలుగుల ఆధారంగానే జీవ గడియారపు ముళ్లు కదుల్తాయి. ప్రత్యేకించి, వేకువజాము కిరణాలతో జీవ గడియారం రీచార్జ్‌ అవుతుంది. ఆ వెచ్చని కాంతి మనిషి కనురెప్పల మీద పడగానే నిద్ర తన ‘షిఫ్ట్‌’ ముగించుకుని వెళ్లిపోతుంది అని అర్థం. ‘మెలకువ’ డ్యూటీకి ఎక్కుతుంది. ఆధునిక జీవితాల్లోని సెల్‌ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లూ మొదలైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు లయను తప్పిస్తున్నాయి. వాటి తెరల నుంచి వెలువడే కృత్రిమ నీల వర్ణాలు నిద్రా దేవత ప్రతినిధి అయిన మెలటోనిన్‌ హార్మోన్‌ విడుదలను అడ్డుకుంటున్నాయి. అందుకే, వాటి ముందు కూర్చుంటే నిద్ర పట్టదు. సహజమైన వెలుతురు మనిషికి ఉద్వేగ పరమైన ఆరోగ్యాన్నీ ఇస్తుంది. డిప్రెషన్‌ను దూరం చేస్తుంది. చురుకుదనాన్ని ప్రసాదిస్తుంది.

కృత్రిమ కాంతుల మధ్య గడపొద్దు : సహజకాంతికి దగ్గరగా కూర్చునేవారు, మిగిలిన ఉద్యోగులతో పోలిస్తే ఎంతోకొంత సమర్థంగా పనిచేస్తారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, ఆఫీసులో వీలైనంత వరకూ కిటికీ పక్క సీటులో కూర్చోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి. పొద్దున్నే కాసేపు ఆరుబయటికి వెళ్లాలి. కిరణస్నానం చేయాలి. దురదృష్టవశాత్తూ ట్యూబ్‌లైట్‌ వెలుగులూ, నియాన్‌ ఇలా కృత్రిమ కాంతుల మధ్యనే రోజంతా గడిచిపోతోంది. విద్యుత్‌ బల్బును ఆవిష్కరించడం ద్వారా థామస్‌ అల్వా ఎడిసన్‌ మానవాళికి ఉపకారం చేసిన మాట వాస్తవమే అయినా కృత్రిమ కాంతులు వచ్చాక మనిషి చీకటిని పట్టించుకోవడలేదు. వృత్తి ఉద్యోగాలు రాత్రి వేళల్లో చేసుకుంటున్నారు. దీంతో వెలుతురుకు విలువ లేకుండా పోయింది.

నిద్ర కీలకం : మనిషి జీవనశైలిలో నిద్ర కీలకమైంది. సూర్యాస్తమయం కాగానే మనలోని జీవగడియారానికి ఆ సమాచారం అందుతుంది. మరుక్షణమే, నిద్రకు ఏర్పాట్లు చేసుకోమంటూ శరీరానికి సంకేతాలిస్తుంది. ఆ మేరకు ఒంట్లో అనేక రసాయన మార్పులు జరుగుతుంటాయి. చురుకుదనం మాయం అవుతుంది. మగతను ప్రసాదించే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. కనురెప్పలు బరువెక్కుతాయి. శరీర ఉష్ణోగ్రత కొంతమేర తగ్గుతుంది. ఇవన్నీ మనిషికి లాలిపాడే ఏర్పాట్లే. జీవ గడియారం జారీచేసే ఆ ఆదేశాల్ని మనం గౌరవించాలి. బలవంతంగా నిద్రను చంపుకుని డ్యూటీ కోసమో, కాలక్షేపం కోసమో అర్ధరాత్రి వరకూ మేల్కొని ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులోనూ, వయోజనులకు ఎనిమిది గంటల గాఢ నిద్ర అవసరం. అది కూడా, రోజూ ఒకే సమయానికి పడుకోవాలి. ఒకే వేళకు లేవాలి.

ఆసుపత్రిపాలు కావడానికి కారణం : నిద్రలోనే మన మెదడు పాత జ్ఞాపకాల్ని నిక్షిప్తం చేసుకుంటుంది. చర్మంతోపాటు వివిధ భాగాలు చిన్నాపెద్దా మరమ్మతులు చేసుకుంటాయి. అందుకేనేమో, చర్మ సంరక్షణ క్రీముల్ని నిద్రకు ముందు పూసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు సౌందర్య నిపుణులు. ఆకలిని నియంత్రించే లెప్టిన్‌ హార్మోన్‌నూ నిద్ర ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే లెప్టిన్‌ ఉత్పత్తిలో అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఫలితంగా ఆకలి పెరిగిపోతుంది, ఏది కనిపించినా తినేస్తాం. ఫలితంగా ఊబకాయ సమస్యలు వస్తాయి. నిద్రను దూరంచేసే కార్టిసోల్‌ హార్మోన్‌ ఇమ్యూనిటీ కూడా బలహీనపరుస్తుంది. నిద్రలేమితో బాధపడేవారూ, రాత్రి ఉద్యోగాలు చేసేవారూ తరచూ ఆసుపత్రిపాలు కావడానికి ఇదో కారణం. జీవ గడియారాన్ని ధిక్కరించి నిద్రను కనుక విస్మరిస్తే చర్మానికి ముడతలు వచ్చేస్తాయి, కళ్లకింద చారలు కనిపిస్తాయి, ఏకాగ్రత లోపిస్తుంది. నిద్రకు రెండుమూడు గంటల ముందు నుంచే మనం పూర్తిగా రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోవాలి. కంప్యూటర్లను కట్టేయాలి. సెల్‌ఫోన్‌ పక్కన పెట్టేయాలి. కుటుంబంతో కాలక్షేపం చేయాలి. నిద్రాదేవి పిలవగానే ముసుగు తన్నేయాలి.

ఆ సమయంలో తింటేనే బెటర్ : పన్నెండు గంటల ఉపవాసం ఇష్టమైన పదార్థాలు కనిపించగానే పొట్టనింపుకుంటా. ఆ కొండను కరిగించి, అరిగించి, శరీరానికి అవసరమైన శక్తిని సృష్టించడానికి శరీరం ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెసుసా? ఆ ఇబ్బంది లేకుండా జీవ గడియారం భోజనానికంటూ ఓ ప్రత్యేక సమయాన్ని ఫిక్స్ చేసింది. అప్పుడు తినడమే ఆరోగ్యకరం. ప్రాతః సమయంలో కాలేయం పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఒంట్లోని వ్యర్థాల్ని తొలగించి, రానున్న ఇరవై నాలుగు గంటలూ జీర్ణ వ్యవస్థ నిర్విఘ్నంగా పనిచేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. పొద్దున్నే జీర్ణ వ్యవస్థ కూడా చురుగ్గా పని చేస్తుంది.

ఏ వయసు వారు ఏం తింటే మంచిది - అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా?

అందుకే, రోజులోని మొదటి భోజనం పోషకాలతో సమృద్ధమై ఉండాలంటారు. విటమిన్లూ, ఖనిజాలతో కూడిన ఆహారం తీసుకోవాలంటారు. జీవ గడియారం భోజనాన్ని సూర్యోదయ- సూర్యాస్తమయాలతో ముడిపెట్టింది. ఉదయం పూట ఆరోగ్యకరమైన ఫలహారం. మధ్యాహ్నం సకల పోషకాలతో కూడిన భోజనం. సాయంత్రం ఆరింటిలోపు తేలికపాటి భోజనం. మళ్లీ సూర్యోదయం వరకూ మంచినీళ్లు మినహా ఇంకేమీ తీసుకోకూడదు. జీవ గడియారం అర్ధరాత్రి విందుల్ని అనుమతించదు. పడుకోవాల్సిన సమయంలో పొట్ట నింపుకుంటామంటే ఒప్పుకోదు. అయినా ఆబకొద్దీ ఆరగిస్తే అజీర్తి, విరేచనాలు, ఇన్సులిన్‌లో హెచ్చుతగ్గులు తదితర రూపాల్లో అలారమ్‌ మోగిస్తుంది. ‘పారాహుషార్‌’ అంటూ హెచ్చరిక చేస్తుంది.

ఎక్సెర్‌సైజ్‌తో : మెదడు కూడా జీవ గడియారం పరిధిలోనే పనిస్తుంది. ఉదయం పూట సూపర్‌ కంప్యూటర్‌ను తలదన్నేంత చురుగ్గా ఉంటుంది. ఎంత సంక్లిష్టమైన సమస్యనైనా చిటికెలో పరిష్కరిస్తుంది. వ్యూహ రచనలకూ, కీలక చర్చలకూ, ముఖ్య నిర్ణయాలకూ ఇదే ఉత్తమ సమయం. గడియారపు ముల్లు తిరిగేకొద్దీ శరీరంలో శక్తి తగ్గిపోతూ వస్తుంది. మధ్యాహ్నపు నిస్సత్తువ ఆ ప్రభావమే. చిన్నపాటి కునుకు లేక తేలికపాటి ఎక్సెర్‌సైజ్‌తోనో మళ్లీ శక్తిని నింపుకోవచ్చు. కాసేపటికి మగత వదిలిపోతుంది. చురుకుదనం వెతుక్కుంటూ వచ్చేస్తుంది. మళ్లీ బుర్రకు పనిచెప్పవచ్చు. కీలక సమావేశాలకు అనువైన వేళ ఇది. ఇక సాయంత్రాలు మనిషిలో సృజన పురివిప్పుతుంది. ప్రత్యేకించి కళలకూ, సాహితీ వ్యాసంగాలకూ కేటాయించాల్సిన సమయమిది. ఉదయం లేవగానే స్ట్రాంగ్‌గా ఓ కప్పు కాఫీ తాగడం చాలామందికి అలవాటు. ఇదొక సైకో యాక్టివ్‌ డ్రగ్‌. బాడీ క్లాక్‌ ప్రకారం ఉదయం పూట మనం చాలా యాక్టీవ్‌గా ఉంటాం. అది చాలదన్నట్టు, కాఫీ రూపంలో మరింత చురుకుదనాన్ని జోడిస్తాం. దీంతో గుండె స్పందన వేగం పెరుగుతుంది. రక్తపోటు అధికం అవుతుంది. ఇది అనారోగ్యకరం. మరీ మనసు లాగుతుంటే ఓ రెండుగంటలాగి, అదీ బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఓ చిన్న కప్పునిండా తాగొచ్చు. వీలైతే పాలూ చక్కెరా లేకుండా.

తప్పకుండా పాటించాలి : ఓ మనిషీ జీవ గడియారానికి నువ్వు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అనే సంగతి తెలియదు. నీ చేతిలోని లాప్‌టాప్‌ విలువ లక్షల్లో ఉంటుందని తెలియదు. నీ కాల్‌ కోసం అర్ధరాత్రీ అపరాత్రీ పెద్దపెద్ద క్లైంట్స్‌ ఎదురు చూస్తుంటారని తెలియదు. మిడ్‌నైట్‌ పార్టీలో బిర్యానీ తింటూ నువ్వు కోట్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చు కుంటావని తెలియదు. కార్పొరేట్‌ భవంతులూ, ఖరీదైన లాప్‌టాప్‌లూ, అర్ధరాత్రి వ్యాపార విందులూ, అవకాశాల కోసం పరుగులూ ఇవేవీ లేనప్పటి అది నిన్ను అచ్చమైన మనిషిలానే చూస్తుంది. నిన్ను అంతే స్వచ్ఛంగా ఉంచాలి అనకుంటుంది. నువ్వు నిండు నూరేళ్లూ జీవించాలని కోరుకుంటుంది కాబట్టి ఆ తపనను అర్థం చేసుకోవాలి.నిర్జీవ జీవనశైలి కోసం జీవ గడియారాన్ని విస్మరించొద్దు. అలా చేస్తే ఆరోగ్య సమస్యలు తప్పవు.

నిద్ర గురించి ఈ అపోహలు మీలోనూ ఉన్నాయా? - నిపుణులు చెబుతున్నదేమిటంటే..?

ఆలస్యంగా తినడం కూడా ఛాతీలో మంటకు కారణమా? - ఏ సమయంలో తింటే మంచిది??

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.