ETV Bharat / state

కొట్టేది వాళ్లే కేసులు పెట్టేది వాళ్లే - వైసీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై రాళ్ల దాడులు అనేకం - AP Elections 2024

Stone Attacks on Chandrababu During YSRCP Govt : ఏపీలోని విశాఖ జిల్లా గాజువాక ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగంతుకులు రాళ్లు విసిరారు. ఐదేళ్లలో ఆయన లక్ష్యంగా రాళ్లదాడి జరగడం ఇదే తొలిసారి కాదు జనంలోకి వెళ్లిన పలు సందర్భాల్లో వైఎస్సార్సీపీ ప్రేరేపిత దుండగులు రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అన్నిసార్లూ ఘటనల వెనుక వైసీపీ నాయకులే ఉన్నారని స్పష్టమవుతున్నా సీఎం జగన్‌ ఒక్కసారీ ఖండించలేదు. బాధ్యులపై కఠిన చర్యలూ తీసుకోలేదు. పైగా చంద్రబాబు కావాలనే దాడులు చేయించుకుంటున్నట్లుగా మంత్రులు, వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

Chandrababu
Chandrababu
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 12:41 PM IST

వైసీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై రాళ్లదాడులు అనేకం

Stone Attacks on Chandrababu During YSRCP Govt : జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత గల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై (Chandrababu Fires on Jagan) జగన్‌ పాలనలో అనేక సార్లు వైసీపీ మూకల రాళ్ల దాడులు జరిగాయి. ఈ తరహా దుశ్చర్యలు రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి విధ్వంసానికి తెరలేపగా అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చేందుకు 2019 నవంబరు 29న చంద్రబాబు నాయుడు రాజధానిలో పర్యటించారు.

చంద్రబాబు రాకను నిరసిస్తూ వైసీపీ ప్రోద్బలంతో కొందరు ఆందోళన చేపట్టారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌లో నల్ల బ్యానర్లు కట్టారు. ఆయనతో పాటు సీనియర్‌ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. బస్సు ముందుభాగం, నాయకులు కూర్చున్న వైపు అద్దాలు పగిలాయి. ఈ అరాచకానికి బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా నాటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అది వారికి రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛని వ్యాఖ్యానించారు.

Tension at Punganur in Chandrababu Tour: రావణకాష్టంలా పుంగనూరు.. చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసుల యత్నం

సామాన్యుల పరిస్థితి ఏంటన్న చంద్రబాబు : తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా 2021 ఏప్రిల్‌ 12న చంద్రబాబు తిరుపతిలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనే లక్ష్యంగా రాళ్లు విసిరారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణ వలయంలో ఉన్న తనకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ఆనాడు ఆయన మండిపడ్డారు. పోలీసులు దుండగులను పట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ అక్కడే నేలపై బైఠాయించారు. చివరకు కాలినడకన ఎస్పీ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

Chandrababu Fires on YSRCP: 'ఎన్​ఎస్​జీ లేకపోతే.. వివేకాలాగే నన్నూ చంపుతారేమో?'.. చంద్రబాబు ధ్వజం

సాధారణ కేసుతో సరిపెట్టిన పోలీసులు : ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో 2022 నవంబరు 4న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబుపై ఓ దుండగుడు భవనంపై నుంచి పూలతో పాటు పదునైన రాయి విసిరాడు. పూలను బలంగా విసురుతున్నట్లు గమనించిన ముఖ్య భద్రతాధికారి మధుసూదనరావు అప్రమత్తమై ఆయనకు అడ్డుగా నిలిచారు. దీంతో మధుసూదనరావు గవదపై దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఇది జరిగి ఏడాదవుతున్నా నిందితులెవరో గుర్తించలేదు. హత్యాయత్నం కేసు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేయగా, పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 324 కింద సాధారణ కేసు పెట్టారు.

ప్రకాశం జిల్లాలో 2023 ఏప్రిల్‌ 22న చంద్రబాబు నాయుడు పర్యటించిన సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమక్షంలోనే రాళ్లదాడి జరిగింది. చంద్రబాబు (Chandrababu Yerragondapalem TOUR)యర్రగొండపాలేనికి రాకుండా అడ్డుకోవాలని మంత్రి ముందుగానే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆయన తన క్యాంప్‌ కార్యాలయం వద్దకు నల్లదుస్తులతో వచ్చి చొక్కా విప్పి మరీ సవాల్‌ చేశారు. బాబు వాహనం వచ్చే సమయానికి దాదాపు 200 మంది రోడ్డు వెంట నిల్చొని గోబ్యాక్‌ అంటూ ప్లకార్డులు, నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ప్రదర్శించారు.

టీడీపీ నేతలపైనే ఎదురు కేసులు : చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది బుల్లెట్‌ ప్రూఫ్‌ షీట్‌లను అడ్డుపెట్టి, ఆయనకు రక్షణగా నిలవడంతో ముప్పు తప్పింది. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌ సంతోష్‌కుమార్‌ తలకు రాయి తగిలి బలమైన గాయమైంది. మంత్రి సురేష్‌ దుశ్చర్యను సీఎం జగన్‌ ఖండించలేదు. దోషులపై చర్యలూ లేవు. పైగా టీడీపీ నేతలపైనే ఎదురు కేసులు పెట్టారు.

YSRCP Leaders Attack on TDP Leaders : సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు 2023 ఆగస్టు 4న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో పర్యటించారు. ఆరోజు ఉదయం నుంచే వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు చించేసి దాడులకు దిగిన దుండగులు ఆయన వచ్చాక ఏకంగా రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. చంద్రబాబు అంగళ్లు నుంచి వెళ్లిపోయాక, వైసీపీ శ్రేణులు మళ్లీ రెచ్చిపోయి టీడీపీ నేతల కార్లను ధ్వంసం చేశాయి.

చంద్రబాబు పైనే హత్యాయత్నం కేసు : ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ, ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. అంగళ్లులో తనను చంపేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయని, ఎన్‌ఎస్‌జీ కమాండోల రక్షణలో బయటపడ్డానని 2023 ఆగస్టు 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. 9 పేజీల లేఖతో పాటు తనపై దాడులకు ఆధారంగా 75 పేజీల డాక్యుమెంట్లు పంపించారు.

టీడీపీ కార్యాకర్తలపై దాడులు : నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరులో 2023 సెప్టెంబరు 5న వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. అడ్డుకోబోయిన టీడీపీ కార్యకర్తలను చితకబాదారు. పోలీసులు యువగళం వాలంటీర్లను నియంత్రించారే తప్ప వైసీపీ శ్రేణులను అడ్డుకోలేదు. ఈ దాడిలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్‌ తలకూ బలమైన గాయమైంది.

టీడీపీ అధినేతపై రాయి దాడికి యత్నం - విజయవాడ డ్రామాపైనా తేలుస్తానంటూ చంద్రబాబు ఆగ్రహం - Stones on CBN in Gajuwaka

YSRCP Leaders Attack On TDP Leaders : తెదేపా కార్యకర్తలపై రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులు.. అంగళ్లులో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.