ETV Bharat / state

"అమ్మ డైరీలో కొన్ని పేజీలు" - తొలి నవలతో ప్రశంసలు అందుకున్న టెకీ - SPECIAL STORY ON RAVI MANTRI

తొలి నవలతోనే ప్రశంసలు అందుకుంటున్న యువ రచయిత మంత్రి రవి - ఏడాదిలో లక్షకు పైగా కాపీలు

Ravi_Mantri
AMMA DIARYLO KONNI PAGEELU RAVI MANTRI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 6:53 PM IST

AMMA DIARYLO KONNI PAGEELU RAVI MANTRI SUCCESS STORY : విదేశాల్లో ఉద్యోగం. తీరిక లేని సమయం. కానీ, మాతృభాషపై మమకారం. రచయిత కావాలనే ఆశయం. దీంతో ఖాళీ టైమ్​లో కలాన్ని కదిలించి, అక్షరాలకు ఆయువు పోశాడు. తన ఊహలకు ఊపిరూలూది, మదిలో మెదిలిన మాటలను నవలగా మలిచాడు. పాఠకులకు అర్థమయ్యేలా పదాల గారడీ చేసి పుస్తక ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి నవలతోనే లక్షకు పైగా కాపీలతో రికార్డు సృష్టించిన అమ్మడైరీలో కొన్ని పేజీలు నవల రచయిత సక్సెస్‌ స్టోరీ మీకోసం.

మాతృభాషపై మమకారం. మాతృమూర్తి చూపించిన ఆనురాగం రెండూ ఈ యువకుడిని పుస్తక రచనవైపు మళ్లించాయి. దీంతో అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే నవలతో పుస్తక ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆకట్టుకునే సంభాషణ, అద్భుతమైన కథనంతో లక్షకు పైగా కాపీలు ఆమ్ముుడు పోయేలా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ పుస్తక రచయిత పేరు మంత్రి రవి. కాకినాడ స్వస్థలం. తల్లి భారతీదేవి గృహిణి. తండ్రి సత్య నారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమలాపురంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన రవి, కాకినాడ JNTUలో ఎంటెక్ చదివాడు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే ఆన్‌సైట్‌ రావడంతో ఏడేళ్ల క్రితం ఐర్లాండ్‌ వెళ్లాడు.

ముఠా కూలీ నుంచి... పుస్తకాలు రచయితగా.. ఓ చరిత్రకారుడి ప్రస్థానం

ఉద్యోగం చేస్తూనే రచనపై దృష్టి: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నా మాతృభాషపై మమకారాన్ని మరువలేకపోయాడు రవి. అమ్మమ్మ చెప్పే చందమామ కథలు వింటూ పెరగడంతో ఎప్పటికైనా రచయిత కావాలనే తపన ఇతనిలో ఉండేది. సొంతూరికి వచ్చినప్పుడల్లా కొత్త పుస్తకాలు చదివేవాడు. ఉద్యోగం చేస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా రచనపై దృష్టి సారించాడు. తన ఆలోచనలకు రూపమిస్తూ 2019లో అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తక రచనకు శ్రీకారం చూట్టాడు.

మనుషులంతా మంచివాళ్లే. కానీ, పరిస్థితులే వారితో కొన్ని చెడ్డ పనులు చేయిస్తాయనే కాన్సెప్ట్‌ ఎంచుకున్నాడు రవి. నవల రాసేకంటే ముందు ఎంతో పరిశోధన చేశాడు. పెళ్లికి ముందు ప్రతి మహిళ అమ్మాయే, ఆ అమ్మాయి యువతిగా ఉన్నప్పుటీ జీవితం ఎలా ఉండేదో అనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌నే కథగా మలిచాడీ కాకినాడ కుర్రాడు.

ఏడాది తిరిగేసరికి లక్షకు పైగా అమ్మకాలు: 2023 జూన్‌లో అమ్మడైరీలో కొన్ని పేజీలు నవలను అజు పబ్లిషర్స్‌ ప్రచురించింది. యువతకు బాగా నచ్చడం, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో పుస్తకం గురించి చాలామందికి తెలిసింది. వీటికి తోడు 1980-90 రోజుల్లో సాగే కథ కావడంతో పుస్తక ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఏడాది తిరిగేసరికి నవల అమ్మకాలు లక్షకు పైగా చేరడం గమనార్హం.

తొలి రచనతోనే పాఠకుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకున్నాడీ సాఫ్ట్‌వేర్‌ స్టోరీ రైటర్‌. అమ్మగా మారిన అమ్మాయి ప్రేమ కథా చిత్రాన్ని నవలగా మలిచాడు. ప్రేమ, స్నేహం, బంధుత్వం, భావోద్వేగం వంటి అంశాలకు సరళమైన సంభాషణను జోడించి కళ్లకు కట్టినట్లు కథను వివరించాడు. పుస్తకం చదివే పాఠకులే తమని తాము పాత్రల్లో ఊహించుకునేలా పదాల గారడీ చేశాడు.

డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై పెరుగుతోన్న ఆసక్తి - Youth interested For Reading Books

ఇన్‌స్టాలో రెండున్నర లక్షలమంది ఫాలోవర్లు: రచనతో పాటు రీల్స్‌ కూడా చేస్తుంటాడు రవి. అందరిలా కాకుండా గోదావరి యాసకు తెలుగు సామెతలు, వెటకారం జోడించి వీడియోలు తీస్తుంటాడు. తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలియజెప్పడం కోసం షార్ట్‌ వీడియోలు చేస్తున్నాడు. తన యాస ప్రాసతో ఇన్‌స్టాలో రెండున్నర లక్షలమంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు.

తొలి నవలతోనే పదాల గారడీ చేసి పాఠకుల ప్రశంసలు అందుకున్నాడీ యువ రచయిత. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ మాతృభాషపై మక్కువతో ఖాళీ సమయంలో కలాన్ని కదిలించాడు. అక్షరాలకు ఆయువు పోస్తూ అమ్మడైరీలో కొన్ని పేజీలు పుస్తకాన్ని పాఠకుల మదిలో అచ్చు వేయించాడు.

"ఇంతకు ముందు రచయితగా నాకు అనుభవం లేదు. నేను రాసిన మొదటి నవలే ఇంతగా సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా కూడా ఉంది. నేను ఐర్లాండ్​లో ఉంటాను. ఫ్యామిలీకి దూరంగా ఉండటం వలన ఎక్కువ సమయం దొరికేది. చిన్నప్పటి నుంచీ సాహిత్యం మీద ఆసక్తి ఉండేది. నేనే ఎందుకు ఒక నవల రాయకూడదు అనిపించింది. అయితే పుస్తకంలా వస్తుంది అనుకోలేదు. ఎంతో రీసెర్చ్ చేసి 1980 రోజుల్లో జరిగే కథలా రాశాను". - మంత్రి రవి, రచయిత

కొత్తవాటితో పాటు పాతవి - ఇక్కడ దొరకని పుస్తకమంటూ లేదు - Special Story on Lenin Center

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.