Story On Achanta Gandharva Mahal : రాజులు, జమీందారులు పోయారు. రాజ్యాలు పోయాయి. కానీ వారు నిర్మించిన కట్టడాలు మాత్రం చరిత్రకు సజీవ సాక్ష్యంలా నిలుస్తున్నాయి. 100 ఏళ్లు అవుతున్నా నేటికి చెక్కుచెదరకుండా 25కు పైగా గదులతో టేకు స్తంభాలు, పురాతన వస్తువులు, అలనాటి విద్యుద్దీపాలతో కూడిన భవనం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. దానిపేరే గంధర్వ మహాల్. ఇంతకీ దీనిని ఎవరు నిర్మించారు? మరి ఆ భవనం విశేషాలేంటో ఓసారి చూద్దామా?
నూరేళ్లయినా వన్నె తరగని గంధర్వమహల్ : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని 100 ఏళ్ల కాలం నాటి గంధర్వమహల్ ఇప్పటికీ వన్నె తగ్గకుండా కాంతులీనుతోంది. ఈ మహల్ ఉత్తర భారత నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. దీన్ని 50 సెంట్ల విస్తీర్ణంలో అప్పటి జమీందారు గొడవర్తి నాగేశ్వరరావు అభిరుచికి ప్రతీకగా నిర్మించారు. 1918లో ఈ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టి 1924లో పూర్తి చేశారు. గానుగ సున్నం, కోడిగుడ్ల సొనతో తయారు చేసిన మిశ్రమంతో ఈ మహల్‌ను నిర్మించడం వల్ల నేటికీ చెక్కుచెదరలేదు.
మహల్లో 25కు పైగా గదులు : ఇందులో 25కు పైగా గదులు ఉన్నాయి. ఇక్కడి సెంట్రల్‌హాల్‌లోని పియానోకు 1885లో లండన్‌లో నిర్వహించినటువంటి పురావస్తు ఎగ్జిబిషన్లో రజత పతకం దక్కింది. భవనానికి 100 ఏళ్లు పూర్తి కాగా, మరమ్మతులు చేయించి చేయించి ముస్తాబు చేయించారు. తాతయ్య జ్ఞాపకాలకు గుర్తుగా పురాతన సంపదను కాపాడతామని గొడవర్తి నాగేశ్వరరావు మనవడు శ్రీరాములు చెబుతున్నారు.
శిథిలావస్థలో ఆందోల్ చారిత్రక కట్టడాలు- పునరుద్ధరించాలని స్థానికుల విజ్ఞప్తి