Telugu Students in Bishkek: కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో గత కొన్ని రోజులుగా విదేశీ విద్యార్థులపైన దాడులు జరుగుతున్నాయి. బిష్కెక్‌లో స్థానిక విద్యార్థులు భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్‌స్థాన్ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులకు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత అల్లరి మూకలు విదేశీ విద్యార్థులపై దాడులు చేయడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థుల ఏపీ ఎన్నార్టీ సొసైటీ స్పందించింది.
హెల్ప్ లైన్ నెంబరు ఏర్పాటు: కిర్గిస్థాన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్దుల కోసం ఇవాల్టి నుంచి విదేశాంగశాఖ బిష్కెక్ నుంచి ఢిల్లీకి రెండు విమానాలను నడుపుతోందని ఏపీ ఎన్నార్టీ సొసైటీ తెలిపింది. కిర్గిస్థాన్ నుంచి స్వదేశానికి రావాలని భావిస్తున్న తెలుగు విద్యార్ధులు బిష్కెక్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. మరోవైపు అక్కడి తెలుగు విద్యార్ధుల భద్రతపై ఎప్పటికప్పుడు విదేశాంగ వ్యవహారాల శాఖకు తెలియచేస్తున్నట్టు ఎన్నార్టీ సొసైటీ సీఈఓ వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణంగానే ఉన్నందున స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్న విద్యార్ధులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. మరోవైపు అక్కడి భారత విద్యార్ధుల కోసం భారత రాయబార కార్యాలయం 0555710041 హెల్ప్ లైన్ నెంబరు ఏర్పాటు చేసిందని ఏపీ ఎన్నార్టీ సొసైటీ తెలిపింది.
ఎస్సీఓ సభ్య దేశాధినేతల సమావేశం
విద్యార్థుల భద్రతపై కిషన్‌రెడ్డికి వినతిపత్రం: కిర్గిస్థాన్‌లోని తెలుగు విద్యార్థులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని జీవీకే ఎడ్యుటెక్ బృందం కోరింది. స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం విద్యకుమార్ నేతృత్వంలోని బృందం కిషన్‌రెడ్డిని కాచిగూడలోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడని, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ కూడా రాసినట్లు కిషన్‌రెడ్డి వారికి తెలిపారు. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఎవరూ అందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. సామాజిక మాధ్యమాల్లోని వదంతులను నమ్మొద్దని కోరారు.
కిర్గిస్థాన్‌లోని భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురండి: నామ