Son-in-law Killed Uncle for Property: ఆశకు హద్దు ఉండదు - కష్టపడి సంపాదిస్తే డబ్బు విలువ తెలుస్తుంది. కానీ ఖాళీగా ఉండి అదీ అత్తగారింట్లో కూర్చుని తింటే కష్టం విలువ ఎలా తెలుస్తుంది. ఇన్నాళ్లు మామ ఇంట్లో ఉండి ఆయన పెట్టింది తినడమే కాకుండా ఆయననే అంతమొందించాడు ఓ ఇల్లరికం అల్లుడు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఉద్మీర్‌గల్లీకి చెందిన క్యామొళ్ల శంకర్ (50) మేకల కాపరి. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కాగా పెద్దల్లుడు రవి ఇల్లరికంగా అత్తగారింట్లోనే ఉంటున్నారు. శంకర్ తనకు ఉన్న మేకలను చూసుకుంటూ హ్యాహీగా ఉంటున్నాడు. అతనికి ఇంటితో పాటు మరో ఖాళీ స్థలం ఉంది.
పెద్దల్లుడు రవికి మామ ఆస్తిపై కన్నుపడింది. ఎలాగైనా వాటిని దక్కించుకోవాలనుకున్నాడు. శనివారం రాత్రి జీవాలు, ఖాళీ స్థలం ఇవ్వాలని మామతో గొడవపడ్డాడు. శంకర్ ఇచ్చేది లేదని తెల్చిచెప్పాడు. అంతే వాటిని దక్కించుకునుందేకు రవి పన్నాగం పన్నాడు. గొడవ జరిగిన తర్వాత అత్త చిన్నమ్మతో మాట్లాడాడు. అతని ఆలోచనకు అత్త వంత పాడింది. అంతే శనివారం అర్ధరాత్రి మేకల కొట్టంలో నిద్రిస్తున్న శంకర్‌ను రవి, చిన్నమ్మ గొంతునులిమి చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు వచ్చి పడుకున్నారు.
ఆదివారం ఉదయం మృతదేహాన్ని తీసుకువచ్చి సహజ మరణంగా చిత్రీకరించి అందరినీ నమ్మించారు. అయితే పట్టణంలోనే నివసిస్తున్న రెండో కుమార్తె సవిత తండ్రి మరణ వార్త తెలుసుకుని పుట్టింటికి వచ్చింది. మృతదేహంపై మెడ వద్ద గాట్లు చూసి అనుమానం వచ్చింది. ప్రశ్నించినా ఎవరూ సమాధానం చెప్పలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు.
సీఐ వెంకటనారాయణ ప్రాథమిక విచారణలో హత్యకు ఆధారాలు లభించడంతో రవి, చిన్నమ్మలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నిందితులిద్దరూ హత్య చేసినట్లు అంగీకరించారని సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మూడున్నర లక్షల కోసమే చిన్నారిని చిదిమేశారు
ప్రేమించలేదని స్నేహితుడే చంపేశాడు - సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్