ETV Bharat / state

భారత్​లో స్మార్ట్ ఫార్మింగ్​ - ఉత్పత్తుల ఎగుమతులపై శాస్త్రవేత్తల దిశానిర్దేశం - వ్యవసాయంలో స్మార్ట్​ టెక్నాలజి

Smart Farming Technologies in India : భారతీయ వ్యవసాయ రంగంలో టెక్నాలజీ హవా కొనసాగుతోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో స్థిరమైన వ్యవసాయం, జీవవైవిధ్యం, పర్యావరణం పరిరక్షణలో స్మార్ట్ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారత్‌లో వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు వేధిస్తున్నాయి. ప్రతి ఏటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, సంస్థాగత రుణాలు, నాణ్యమైన విత్తనం, తెగుళ్లు, చీడపీడల బెడద, కూలీల కొరత, పంట కోతలు, ప్రాసెసింగ్, నిల్వ, రవాణ, మార్కెట్‌లో దళారుల బెడద వంటివి సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్- క్రిడాలో జరిగిన సదస్సులో ఆయా అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రో ఫిజిక్స్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో స్మార్ట్‌ టెక్నాలజీ సాయంతో వ్యవసాయంలో సవాళ్లను అధిగమించే అంశంపై శాస్త్రవేత్తలు మేథోమథనం జరిపారు.

Smart Farming Techniques in India
Smart Farming Technologies in India
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 2:04 PM IST

భారత్​లో స్మార్ట్ ఫార్మింగ్​ ఉత్పత్తుల ఎగుమతులపై శాస్త్రవేత్తలో దిశానిర్దేశం

Smart Farming Technologies in India : భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కేంద్ర బిందువుగా మారిన దృష్ట్యా జనాభాలో 56 శాతం మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి. భారతీయ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థకు ప్రాముఖ్యత చాలా వరకు ఉండటంతో ఈ రంగం బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. వ్యవసాయ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుల వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

అయినా ఇంకా ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో గ్రామీణ ప్రాంతాల్లో విత్తనం, యంత్రాలు, పనిముట్ల నుంచి సంస్థాగత రుణాలు, పెట్టుబడుల వరకు కూడా వ్యవసాయ రంగం అనేక సమస్యలు అన్నదాతలను వేధిస్తున్నాయి. అలాంటి అంశాలకు పరిష్కారం చూపే అంశంపై హైదరాబాద్ సంతోష్‌నగర్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ క్రిడాలో జాతీయ సదస్సు జరిగింది. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రో ఫిజిక్స్ - ఐఎస్‌ఏపీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన పర్యావరణహిత సుస్థిర వ్యవసాయం - స్మార్ట్ టెక్నాలజీస్‌పై వ్యవసాయ శాస్త్రవేత్తలు చర్చించారు.

సాగుదారుడికి సాంకేతికత అండ - హైదరాబాద్​లో ఘనంగా అగ్రిటెక్‌ సౌత్‌ ప్రదర్శన

క్రిడా సదస్సుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్​ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హమాన్షు పాఠక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి అనుబంధ జాతీయ పరిశోధనల సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, రైతులు సహా 350 మంది పైగా సదస్సుకు హాజరయ్యారు.

Smart Farming Techniques in India : వాతావరణ మార్పుల నేపథ్యంలో కృత్రిమమేథ, బిగ్​డేటా అనలిటిక్స్, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్, సెన్సార్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్కులతోసహా వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ, సహజ వనరుల నిర్వహణలో అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలతో వ్యవసాయాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లడంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. పర్యావరణహితం దృష్ట్యా జీవవైవిధ్యం, సాగు నీరు, భూమి ఆరోగ్యం, కూలీల కొరత వంటి సవాళ్లను అధిగమించేందుకు వ్యవసాయ పరిశోధనలు, అభివృద్ధి, అదనపు విలువ జోడింపు, మార్కెటింగ్, కొత్త టెక్నాలజీస్‌ వంటి అనేక అంశాలను ప్రస్తావించారు.

భారత్‌లో వాతావరణ మార్పులు, నీరు, ఎనర్జీ సంక్షోభం వ్యసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయినా ఒక్క రోజు కూడా దేశంలో వ్యవసాయం నిలిచిపోలేదు. కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో సైతం సేద్యం ఆగలేదు. భారత్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో మరింత వృద్ధి సాధించడంపై క్రిడా సదస్సులో శాస్త్రవేత్తలు దిశానిర్దేశం చేశారు. ప్రాచీన, సంప్రదాయ పద్ధతులతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపకరణాలు ఉపయోగించి వ్యవసాయం చేస్తే లాభదాయకంగా ఉంటుందని సూచించారు.

చిరుధాన్యాల ఉత్పత్తి కోసం ఆహార సార్వభౌమత్వం కార్యక్రమం - ప్రభుత్వానికి 10 డిమాండ్లతో తీర్మానం

ప్రపంచం స్థిరమైన వృద్ధి ఆర్థిక వ్యవస్థ, నాణ్యమైన విద్య, వ్యవసాయం, పరిశ్రమలు వంటి అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే పర్యావరణం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కారకాల్లో ఒకటి. ఆరోగ్యం, పరిశుభ్రత అనేది మానవజాతి సుస్థిరత ఏ దేశం పురోగతిలోనైనా కీలకమే. ఇది స్వచ్ఛమైన, కాలుష్య, ప్రమాదకర రహిత వాతావరణం నుంచి వస్తుంది. అందువల్ల ఏ దేశ పౌరులు ఆరోగ్యకరమైన జీవితం గడపగలరో నిర్ధారించడానికి పర్యవేక్షణ చాలా అవసరం. పర్యావరణ పర్యవేక్షణ - ఈఎం అనేది సరైన ప్రణాళిక, నిర్వహణ, వివిధ కాలుష్యాలను నియంత్రించడం, అనారోగ్యకరమైన బాహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను సమర్థవంతంగా పరిష్కస్తుంది. ఆయా అంశాలను క్రిడా సదస్సులో వక్తలు వివరించారు.

ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 10 బిలియన్లకు చేరబోతుంది. జనాభా ఆహార డిమాండ్ 60 శాతం పెరుగుతుంది. ప్రస్తుత పర్యావరణ క్షీణత రేటులో ఈ డిమాండ్‌ చేరుకోవాలంటే తగినంత వ్యవసాయ యోగ్యమైన భూమి మిగిలి ఉండదు. ఫలితంగా ఆహార భద్రత సమస్య, స్థిరత్వ ఆందోళనలు ఏర్పడతాయని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రపంచ ఆహార డిమాండ్‌ తీర్చడానికి రైతులు తమ ఉత్పత్తి పెంచుకోవడానికి సహాయపడే చర్యలను తప్పనిసరిగా ఉపయోగించాల్సిన తరుణం ఆసన్నమైంది.

Paddy Cultivation Different Shapes In Nizamabad : ప్రకృతితో మమేకం.. రసాయనాలకు దూరం... నిజామాబాద్‌లో విభిన్న రూపాల్లో వరి సాగు

క్రిడా సదస్సులో వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్​డేటా అనలిటిక్స్, డోన్లు, రిమోట్ సెన్సింగ్, సెన్సార్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల వినియోగంపై చర్చించారు. వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ, సహజ వనరుల నిర్వహణలో అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలు సమగ్రపరపచడంపై రైతులకు కల్పించే అంశంపై క్రిడా సదస్సులో శాస్త్రవేత్తలు విస్తృతంగా చర్చించారు. 2024ను నేషనల్ డిజిటల్ సంవత్సరంగా ప్రకటించిన దృష్ట్యా ఈ ఏడాది పొడవునా ఆయా అంశాలపై విస్తృతంగా చర్చించి ప్రభుత్వపరంగా విధాన రూపకల్పన, అమలు కోసం సమగ్ర నివేదిక రూపొందించి ప్రధాని మోదీకి సమర్పిస్తామని భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ వెల్లడించింది.

ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు- కృత్రిమంగా కశ్మీర్ వాతావరణం, ఎలాగో తెలుసా?

పర్యావరణంలో వాయు నాణ్యత, నీటి కాలుష్యం, రేడియేషన్ కాలుష్యం వంటి నిజమైన సవాళ్లు అధిగమిస్తూ ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడం ద్వారా ప్రపంచం స్థిరమైన వృద్ధిని సాధించడానికి పర్యవేక్షణ ఎంతో అవసరం. ఇటీవల పర్యావరణ పర్యవేక్షణ అనేది ఒక స్మార్ట్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ - ఎస్​ఈఏ వ్యవస్థగా మారిపోయింది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ - ఐఓటీ, ఆధునిక సెన్సార్ల అభివృద్ధిలో అద్భుతమైన పురోగతి కనిపిస్తోంది.

ప్రస్తుత మాన్యుస్క్రిప్ట్ ఎస్‌ఈఎంపై గాలి నాణ్యత, నీటి నాణ్యత, రేడియేషన్ కాలుష్యం, వ్యవసాయ వ్యవస్థల పర్యవేక్షణ కలిగి ఉన్న ముఖ్య రచనలు, పరిశోధన అధ్యయనాలపై విస్తృత చర్చ సాగుతోంది. సెన్సార్ టెక్నాలజీ, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్ మెథడ్స్‌లో పురోగతి పర్యావరణ పర్యవేక్షణ ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చంటూ క్రిడా సదస్సులో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు.

Young Farmer Mohammad Adeeb Ahmed Success Story : ఉద్యోగం వదిలేశాడు.. సాగులో లక్షలు సంపాదిస్తున్నాడు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.