ETV Bharat / state

స్కిల్ యూనివర్సిటీలో స్కిల్​ స్ప్రింట్​ ప్రోగ్రామ్ - నైపుణ్యావృద్ధిపై ప్రత్యేక శిక్షణ - SKILL SPRINT INTERNSHIP PROGRAM

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 'స్కిల్ స్ప్రింట్' పేరిట ప్రత్యేక ఇంటర్న్​షిప్ ప్రోగ్రామ్ - పోస్టర్​ను విడుదల చేసిన మంత్రి

Skill Sprint Internship Program in Young India Skill University
Skill Sprint Internship Program in Young India Skill University (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2025, 9:52 AM IST

Skill Sprint Internship Program in Young India Skill University : విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టీ-వర్క్స్​, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో 'స్కిల్ స్ప్రింట్' పేరిట ప్రత్యేక ఇంటర్న్​షిప్ ప్రోగ్రామ్​ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్ట్​ను సచివాలయంలో గురువారం మంత్రి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణను నైపుణ్య మానవ వసరులకు కేరాఫ్ అడ్రస్​గా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

Skill Sprint Internship Program in Young India Skill University
స్కిల్‌ స్ప్రింట్‌ ప్రోగ్రామ్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు, చిత్రంలో టీ-వర్క్స్‌ సీఈవో జోగిందర్, స్కిల్‌్్స వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ చమన్‌ (ETV Bharat)

‘స్కిల్‌ స్ప్రింట్‌’ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం వ్యవధి 90 రోజులని అందులో భాగంగా ఇంజినీరింగ్, రోబోటిక్స్, మేనేజ్‌మెంట్, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. టీ-వర్క్స్‌లోని అధునాతన సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకోవావని సూచించారు. సొంతంగా ప్రాజెక్టులను రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ ద్వారా అకాడమిక్‌ క్రెడిట్స్‌ ఇస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.

ఆసక్తి గల కళాశాలలు, విద్యార్థులు టీ-వర్క్స్‌ కార్యాలయంలో సంప్రదించాలని, yisu.in వెబ్‌సైట్లో కూడా వివరాలు పొందుపరిచామన్నారు. కార్యక్రమంలో టీ-వర్క్స్‌ సీఈవో తనికెళ్ల జోగిందర్, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ చమన్‌ మెహతా తదితరులు పాల్గొన్నారు.

స్కిల్స్​ యూనివర్సిటీలో కొత్త కోర్సులు - జాయిన్ అయితే చేతిలో జాబ్ ఉన్నట్లే!

దేశానికే రోల్​మోడల్​గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University

'వచ్చే విద్యా సంవత్సరానికి యంగ్​ ఇండియా స్పోర్ట్స్​ యూనివర్సిటీ' - CM REVANTH ON SPORTS UNIVERSITY

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.