ETV Bharat / state

'సీతారామ'లో మరో ముందడుగు! - రూ.4 వేల కోట్ల పనులకు రేపోమాపో టెండర్లు!! - Sita rama lift project

Sita Rama Project : సీతారామ ఎత్తిపోతల పనుల్లో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావొస్తుండగా, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలను రేపో, మాపో టెండర్‌ ప్రకటన జారీ కానుంది. మొత్తం దాదాపు రూ.4 వేల కోట్ల పనులకు టెండర్‌ ప్రకటన వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

Sita Rama Project
Sita Rama Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 8:49 AM IST

Updated : Oct 3, 2024, 10:06 AM IST

Sita Rama Lift Irrigation Project Start Soon : చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో పురోగతి కనిపించనుంది. ఈ ఎత్తిపోతల ద్వారా కింద ఆయకట్టుకు నీరు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీల టెండర్లకు రంగం సిద్ధమైంది. సుమారు రూ.2000 కోట్ల విలువైన పనులకు రెండుమూడు రోజుల్లో టెండర్లు పిలువనున్నారని సమాచారం. సీతారామ పనులను ఎనిమిది ప్యాకేజీలుగా విభజించగా వాటిలో మొదట నాలుగు ప్యాకేజీలకు టెండర్​ ప్రక్రియ ప్రారంభిస్తారు.

మిగిలిన 2 వేల కోట్ల పనుల టెండర్లను సైతం త్వరలోనే చేపట్టనున్నారు. ఇన్నాళ్లూ ప్రధాన పనులు పూర్తి కావచ్చినా డిస్ట్రిబ్యూటరీ కాల్వ పనులకు టెండర్‌ ప్రక్రియ చేపట్టలేదు. చాలాకాలంగా సంబంధిత ఇంజినీర్లు, నీటిపారుదలశాఖ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నా ముందడుగు పడలేదు.

2026 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి : ఇటీవల సీతారామ ఎత్తిపోతల పథకంపై సమీక్షించిన ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీల టెండర్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాల స్థిరీకరణకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016లో చేపట్టారు. మొదట రూ.7,026 కోట్లతో పరిపాలనపరమైన అనుమతి ఇచ్చారు.

కాగా 2018లో రూ.13,057.98 కోట్లతో ప్రభుత్వం సవరించింది. ప్రధాన కాలువ, లిప్టు పనులను 8 ప్యాకేజీలుగా విభజించి చేపట్టగా ఇందులో 95 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఆఖరుకు మిగిలిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పంపు హౌస్​ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటరీ పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వం ఆమోదం తర్వాతే టెండర్లు : డిస్ట్రిబ్యూటరీ పనులను ఎనిమిది ప్యాకేజీలుగా విభజించారు. రూ.4,179 కోట్ల అంచనా వ్యయంతో సంబంధిత ఇంజినీర్లు చాలాకాలం క్రితమే ప్రభుత్వానికి పంపించారు. కానీ టెండర్లు పిలవడానికి ఆమోదం లభించలేదు. ఈ అంచనా వ్యయంలో సుమారు రూ.1400 కోట్ల భూసేకరణ వ్యయం కలిపి ఉంది. ప్రభుత్వ ఆమోదం తర్వాతే టెండర్లు పిలవాలని, ప్రతిపాదనలన్నీ ఈఎన్సీ ద్వారా పంపాలని ఈ జనవరిలో ఒక మెమో జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపించి వేచిచూస్తున్నారు.

రెండు రోజుల్లో టెండర్లకు నోటిఫికేషన్ : ఇటీవలే మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్, కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తదితరులు డిస్ట్రిబ్యూటరీ పనుల టెండర్లపై చర్చించారు. వెంటనే టెండర్లు పిలవాలని ఇంజినీర్లను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా ఒకటి, రెండు, ఏడు, ఎనిమిది ప్యాకేజీల పనులకు ఒకటి, రెండురోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి.

సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్ - పరవళ్లు తొక్కిన గోదారమ్మ - SITARAMA PROJECT LAUNCHED

కష్టం కేసీఆర్‌దైతే బటన్‌ నొక్కేది మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు : జగదీశ్ రెడ్డి - BRS Jagadish Reddy On Sitarama

Last Updated : Oct 3, 2024, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.