SIB Ex DSP Praneeth Rao Case Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం, పోలీస్ కస్టడీ వ్యవహారంపై నిందితులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రేపటి వరకు సమయం ఇస్తూ కేసును వాయిదా వేసింది.
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు, పనిలో పనిగా ఫోన్ ట్యాపింగ్‌ను తమ సొంత అవసరాలకు వాడుకున్నట్లుగా భావిస్తున్న పోలీసులు, బడా వ్యాపారవేత్తలు, హవాలా దందా చేసే వారిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా, కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల్ని కోర్టు ఆదేశించింది.
ప్రణీత్ రావు వ్యవహరంలో వెలుగులోకి కీలకాంశాలు - కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ల ఆచూకీ గుర్తించిన పోలీసులు -
ప్రైవేట్ దందా : ప్రణీత్ రావు బృందం సాగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఉపయోగించారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఎన్నికల సమయంలో పట్టుకున్న డబ్బులో ప్రతిపక్షాలకు చెందినదే ఎక్కువగా ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఇది సాధ్యమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రణీత్‌రావు బృందం తన సొంత ప్రయోజనాలకు కూడా ట్యాపింగ్‌ను వాడుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో హవాలా, స్థిరాస్తి వ్యాపారాలపై నిఘా పెట్టి భారీగా డబ్బు దండుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా!
శాసనసభ ఎన్నికల వేళ పోలీసు తనిఖీల్లో దాదాపు రూ.350 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం హవాలా వ్యాపారానికి సంబంధించినదే. 300 కిలోల బంగారం, వెయ్యి కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో సొత్తు రవాణా చేసే వారినే ప్రణీత్ రావు బృందం లక్ష్యంగా చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బు కనుక ఎవరూ ఫిర్యాదు చేయరు. పట్టుకున్న డబ్బులో దొరికినంత దండుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత లోతుగా విచారించేందుకు అదనపు ఎస్పీలు సహా ప్రణీత్‌రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు షాక్ - పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు