ETV Bharat / state

హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావు - కస్టడీ రద్దు చేయాలని లంచ్‌మోషన్‌ పిటిషన్‌

SIB Ex DSP Praneeth Rao Case Update : ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. 7 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్​ను విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. మరోవైపు పోలీసు కస్టడీని రద్దు చేయాలని కోరుతూ ప్రణీత్‌రావు హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కస్టడీ సమయంలో అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని ఆయన పిటిషన్‌లో తెలిపారు.

SIB Ex DSP Praneeth Rao
SIB Ex DSP Praneeth Rao Case Update
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 6:54 PM IST

Updated : Mar 19, 2024, 9:24 PM IST

SIB Ex DSP Praneeth Rao Case Update : ఫోన్‌టాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను, సవాల్ చేస్తూ డీఎస్పీ ప్రణీత్ రావు తరఫు న్యాయవాది, హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా, కిందికోర్టు కస్టడీకి ఇచ్చిందని ప్రణీత్‌ రావు తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

కస్టడీ సమయంలో అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని ఆయన పిటిషన్‌లో తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. దర్యాప్తులోని అంశాలను అధికారులు మీడియాకు లీక్ చేస్తున్నారని, వాటిని ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని తెలిపారు.

రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని, బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదన్నారు. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని, ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని ప్రణీత్ రావు కోరారు. ప్రణీత్‌రావు కస్టడీపై పోలీసుల వివరణ కోరుతూ హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.

ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్​ రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. 7 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్​ను విచారించిన పోలీసులు, కీలక సమాచారాన్ని సేకరించారు. బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్​లో ప్రణీత్​ను విచారించిన పోలీసులు, ఎవరూ లోనికి రాకుండా, మీడియా కంటపడకుండా గేట్లు మూసి వేశారు. ఎస్‌ఐబీలో అతనితో పాటు పని చేసిన ఇన్​స్పెక్టర్​ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు, వారి వాంగ్మూలం నమోదు చేశారు.

వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రణీత్​ను ప్రశ్నించారు. డిసెంబర్ 4వ తేదీన ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఎవరెవరు సహకరించారని ప్రణీత్ రావును ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలు, ఐఎంఈఐ నంబర్లు, సీడీఆర్, ఐపీ అడ్రస్‌ల డేటాను సేకరించారని అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ధ్వంసం చేసి, కొత్తవి ఎందుకు అమర్చాల్సి వచ్చిందని ప్రణీత్​ను ప్రశ్నించగా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.

హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి అడవిలో పడేసిన ప్రణీత్ ​రావు - నేడు వికారాబాద్​ తీసుకెళ్లి విచారణ

ఆపరేషన్​ వికారాబాద్​ : మరోవైపు వికారాబాద్ అడవుల్లో పడేసిన ధ్వంసం చేసిన ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణీత్​ను స్వయంగా అక్కడకు తీసుకెళ్లి పడేసిన ప్రాంతంలో పోలీసులు గాలించనున్నారు. రెండో రోజు విచారణ సందర్భంగా హార్డ్‌ డిస్క్‌లను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు ప్రణీత్​రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రణీత్‌ను వికారాబాద్ తీసుకెళ్లి హార్డ్ డిస్కులకు సంబంధించిన శకలాలు వెతికి, స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నెల 23 వరకు ప్రణీత్​రావు కస్టడీ - తొలి రోజు విచారిస్తున్న పంజాగుట్ట పోలీసులు

రెండో రోజు ప్రణీత్​రావు విచారణ - బంజారాహిల్స్ పీఎస్‌లోకి ఎవరినీ అనుమతించని పోలీసులు

Last Updated : Mar 19, 2024, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.