ETV Bharat / state

హెల్మెట్​ పెట్టుకుంటే జుట్టు రాలుతోందని దిగులు పడుతున్నారా? - అయితే దీన్ని ట్రై చేయండి - Shoulder Helmet Designed - SHOULDER HELMET DESIGNED

Shoulder Helmet Designed by Phani Kumar Success Story : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. హెల్మెట్‌ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందన్న ఆందోళన అందుకు కారణమని తెలుస్తోంది. అయితే, ఆ ఆలోచనతోనే షోల్డర్‌ హెల్మెట్‌కు రూపుదిద్దాడు ఆ యువకుడు. మరి ఆ హెల్మెట్‌ ప్రత్యేకత ఏంటో చూద్దామా.

Shoulder Helmet Designed by Hyderabadi Phani Kumar
Shoulder Helmet Designed by Hyderabadi Phani Kumar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 6:02 PM IST

Shoulder Helmet Designed by Hyderabadi Phani Kumar : పట్టణీకరణలో భాగంగా వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఎక్కువగా ద్విచక్ర వాహనాలే రోడ్లపై రాజ్యమేలుతున్నాయి. కానీ, వాటిని నడిపేవారు మాత్రం భద్రత ప్రమాణాలను పాటించడం లేదు. జుట్టు రాలిపోతుందనే భయంతో హెల్మెట్‌ ధరించడం లేదు. అలాంటి అపోహకు చెక్‌ పెడుతూ షోల్డర్‌ సపోర్ట్ హెల్మెట్‌ తయారు చేశాడు ఓ యువకుడు. అతని పేరు ఫణి కుమార్‌. గుంటూర్‌ జిల్లా, వేల్పూర్‌ స్వస్థలం. భీమవరంలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చాడు. 2 సంవత్సరాల పాటు నాట్కో ఫార్మా కంపెనీలో ఈహెచ్ఎస్​గా పనిచేశాడు. ఆ తరువాత జేఎన్టీయూ కళాశాలలో పర్యావరణ శాస్త్రంలో పీహెచ్​డీ పూర్తిచేశాడు.

ఈ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోదు : నగరాల్లో బైక్‌ నడిపేవారు హెల్మెట్లు ధరించకపోవడాన్ని గమనించాడు ఫణికుమార్‌. జుట్టు రాలిపోతుందనే భయమే అందుకు కారణమని తెలుసుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారించే దిశగా అడుగులేయాలని సంకల్పించాడు. అలా బైక్‌ ప్రయాణంలో ఉపకరించేలా 6 నెలలు కష్టపడి షోల్టర్‌ సపోర్ట్ హెల్మట్‌ తయారు చేశాడు ఫణి కుమార్‌. దీంతో పాటు మెడచుట్టూ వీల్ పెట్టుకునే హెల్మెట్‌ కూడా తయారు చేసినట్లు వివరిస్తున్నాడు. ఈ హెల్మెట్ టీఎస్ఐసీ హైదరాబాద్ నుంచి బెస్ట్‌ ఇన్నోవేషన్‌గా ఎంపికైనట్లు చెబుతున్నాడు ఫణి. ప్రస్తుతం టీ వర్క్‌ సహకారంతో తది మెరుగులు దిద్దుతున్నట్లు వివరిస్తున్నాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి జువ్వా ఇండస్ట్రీస్‌ అనే స్టార్టప్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నాడీ ఇన్నోవేటర్‌.

యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్‌ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు

మూడు నెలల్లో ఈ హెల్మెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఫణి చెబుతున్నారు. పట్టణాల్లో డెలీవరీ బాయ్స్‌గా చేసే వారికి ఈ హెల్మెట్‌ మేలు చేస్తుందని అంటున్నారు. పేటెంట్‌ హక్కులు అందిన తర్వాత తక్కువ ధరకే ఈ హెల్మెట్లు అందిస్తామని ఫణి కుమార్‌ అంటున్నారు. ప్రస్తుతం తన స్నేహితుల ద్వారా ట్రయల్‌ రన్స్ జరుగుతున్నాయని త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకువస్తామని చెబుతున్నారు.

"జుట్టు రాలిపోకుండా షోల్డర్‌ సపోర్ట్ హెల్మెట్‌ తయారు చేశాను.హెల్మెట్ సపోర్ట్​ హ్యాండిల్స్ పిక్స్ చేసి షోల్డర్​తో లేపినప్పుడు హెల్మెట్ లేస్తుంది. 3 రోజుల్లో ఈ హెల్మెట్​ను మార్కెట్​లోకి తీసుకొస్తాం. పట్టణాల్లో డెలీవరీ బాయ్స్‌గా చేసే వారికి ఈ హెల్మెట్‌ మేలు చేస్తుంది. ఫార్మా కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి, జువ్వా ఇండస్ట్రీస్‌ అనే స్టార్టప్‌ను ప్రారంభించాను." -ఫణికుమార్‌, షోల్డర్‌ హెల్మెట్‌ రూపకర్త

ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్​డీ - కర్ణాటక గవర్నర్​ నుంచి పట్టా అందుకున్న యువకుడు

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.