Sharda River Groins Problems to Farmers in Anakapally District : శారదా నది పక్కనే ఉన్నా అక్కడి రైతులకు సాగునీరు కష్టాలు తప్పలేదు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతాంగం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పడానికి అనకాపల్లి జిల్లా శారదానది గ్రోయిన్లే నిదర్శనం. గ్రోయిన్లు నిర్మించి సాగు నీరందించాలని ఐదేళ్లుగా అధికారులతో మెరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని రైతులు వాపోతున్నారు.
స్పందన: అప్రోచ్ పనులకు రూ. 41 లక్షల నిధులు
Government Neglecting Repairs of Sharada River : అనకాపల్లి జిల్లాలో ప్రధాన నది శారద. ఇక్కడ నుంచి రైతులకు సాగునీరు అందించేందుకు బ్రిటిష్ కాలంలో గ్రోయిన్ల నిర్మాణాలు జరిగాయి. శారదా నది నుంచి ఎల్లయ్య, నాగులపల్లి, చెర్లోపల కాలువల ద్వారా సుమారు 7వేల ఎకరాలకు అనకాపల్లి మండలం, పట్టణ ప్రాంతాల్లోని భూములకు సాగు నీరందాల్సి ఉంది. ఐదేళ్లుగా గ్రోయిన్ల నిర్వహణ సక్రమంగా లేకపోవటం వల్ల కాలువ చివరి భూములకు సాగునీరు అందటంలేదు. జలవనరుల శాఖ అధికారులకు రైతులు ఎన్ని ప్రతిపాదనలు పంపినా అవి బుట్టదాఖలు అవుతూనే వచ్చాయి. సాగునీటి సమస్యపై అధికారులు తీవ్ర జాప్యం చేయటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ. 41 లక్షలతో శారదా నది కాజ్ వే పనులు
'మంత్రి గుడివాడ అమర్నాథ్, జగన్ కలిసి రైతులను కష్టపెడుతున్నారు. శారదానది పక్కనే ఉన్నా నీటి కొరతతో ఇబ్బందులు ఎద్కుంటున్నాం. పంటలు ఎండిపోతున్నాయి. కనీసం పశగ్రాసం కూడా లేదు ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోండి. అధికారులు స్పందించకపోవడంతో మేమంతా కలిసి పొలాల నీళ్ల కోసం డబ్బు పోగేసి తాత్కాలికంగా పంటలు పండించుకున్నాం. ఆ నిధులు కూడా మాకు ఇప్పటికీ ఇవ్వలేదు.' - బాధిత రైతులు
Irriration Problems to Anakapally Farmers : ప్రస్తుతం గ్రోయిన్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నా మరమ్మతులు చేయకపోవడం పాలకుల తీరుకు నిదర్శనం. అధికారులు రెండు కోట్లు వ్యయంతో మరమ్మత్తుల ప్రతిపాదనలు సిద్ధం చేసినా అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్ వీటిని కార్యరూపంలోకి తీసుకురాలేకపోయారు. చిన్నపాటి మరమ్మతులకు కూడా నిధులు మంజూరు కాకపోవడం ఈ దయనీయస్ధితికి కారణమైందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ సాగునీరు కూడా అందించలేదని రైతులు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు.
'శారదా నది వంతనపై నుంచి రాకపోకలకు చర్యలు తీసుకుంటాం'
దేవరాపల్లి శారద నదిపై శిథిలమైన కాలిబాట